72nd Miss World Winner : 16 ఏళ్లకే మహమ్మారి నుంచి తప్పించుకొని ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన ఓపల్ సుచాతా
72nd Miss World Winner : థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా జీవితం చాలా ట్విస్ట్‌లతో కూడింది. ప్రపంచ సుందరి కిరీటం వరకు ఆమె అంత ఈజీగా రాలేదు.

72nd Miss World Winner Opal Suchata Chuangsri: థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ 72వ ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఆమె విజేతగా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన పోటీల్లో 108దేశాల సుందరీమణులు పాల్గొన్నారు. తమ టాలెంట్‌ను చూపించారు. అయితే అందర్నీ వెనక్కి నెట్టిన సుచాతా మాత్రం కిరీటాన్ని ఎగరేసుకుపోయారు. రన్నర్‌గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజెనిలిచింది. రెండో రన్నరప్‌గా పోలాండ్ భామ మాజా క్లాజ్డా నిలిచింది.
16 ఏళ్లకే మహమ్మారి నుంచి బయటపడిన సుచాతా
ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన లాంటి బాధను వేరే ఎవరూ పడకూడదని అమె ప్రయత్నిస్తున్నారు. ఓ అవగాహన కార్యక్రమంలో తనకు జరిగిన విషయాలను పంచుకున్నారు ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ . 16 ఏళ్ల వయసులోనే తనకు ఏదో జరుగుతుందని గ్రహించారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే రొమ్ముపై కణితి ఉందని చెప్పారు.
రొమ్ముపై ఉన్న కణితిని అలా వదిలేస్తే ప్రమాదమని క్యాన్సర్‌గా మారుతుందని హెచ్చరించారు. దీంతో ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ వెంటనే సర్జరీ చేయించుకున్నారు. తనకు అవగాహన ఉన్నందునే వైద్యులను సంప్రదించి క్యాన్సర్ బారిన పడకుండా చికిత్స చేయించుకున్నాని అన్నారు. అలా తెలియకుండా ఉంటే మాత్రం కచ్చితంగా తనకు ప్రమాదం ముంచుకొచ్చేది అని వివరించారు. ఈ విషయంపై ప్రపంచంలో చాలా మంది మహిళల, యువతకు అవగాహన ఉండటం లేదని తెలుసుకున్నారు. వెంటనే దీనిపై అవగాహన కల్పించేందుకు నడుంబిగించారు. అప్పటి నుంచి తనకు తోచిన విధంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
ఓపల్ స్పూర్తిదాయక ప్రయాణం
16 ఏళ్ల వయసులోనే శస్త్రచికిత్సను ఎదుర్కొన్నా ఓపల్ తన కలలలను కోల్పోతానని భయపడ్డారు. ఈ అనుభవం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమెత ఈ సవాలును ఒక అవకాశంగా మార్చుకుంది. రొమ్ము క్యాన్స్ర్ సహాయ సంస్థలలో స్వచ్ఛందంగా పనిచేసింది. ఆమె కథ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా ఒక మహిళ ఆమెకు కృతజ్ఞత చెపప్పింది. తన క్యాన్సర్ పోరాటంలో ఓపల్ ఆమెకు ప్రేరణగా నిలిచిందని వివరించింది. ఆ క్షణం తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతుంది ఓపల్. అందుకే ఆ విషయాన్నే తన జీవిత మోటోగా మార్చుకున్నారు. నీవు జీవించడం వల్ల వేరొకరి జీవితం సులభమైందని తెలుసుకోవడమే విజయం అంటారు. ప్రతి ఒక్కరి ఎవరికో ఒకరికి స్ఫూర్తిగా నిలుస్తారని అంటారు.
ఇలాంటి సమాజిక కార్యక్రమాలతోపాటు విద్య, ఇతర విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు ఓపల్. ఆమెకు యుకులెేలెను వెనక్కి తిప్పి వాయించడం బాగా వచ్చు. ఈ ప్రతిభ ఆమె సృజనాత్మకతను, సాంప్రదాయకతను భిన్నంగా ఆలోచించే సామర్థ్యాన్ని చూపిస్తుంది.
ఓపల్ జంతుప్రేమికురాలు
ఓపల్‌కు జంతువులపై అపారమైన ప్రేమ ఉంది. ఆమెకు 16పిల్లులు, ఐదు కుక్కలు పెంపుడు జంతువులుగా ఉన్నాయి.





















