Japan Earthquake: జపాన్‌లో భూకంపం, ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం - టర్కీలోనూ ప్రకంపనలు
Japan Earthquake: జపాన్‌లో భూకంపం ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది.
Japan Earthquake:
భూ ప్రకంపనలు
జపాన్‌లో భూకంపం అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురి చేసింది. హొక్కైడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్ర 6.0గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూమి లోపల 46 కిలోమీటర్ల లోతు వరకూ ఈ భూకంప ప్రభావం కనిపించినట్టు German Research Centre for Geoscience స్పష్టం చేసింది. తెల్లవారుజామున 5.44 గంటలకు భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. అయితే...ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. ఒక్కసారిగా భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్‌తో పాటు టర్కీలోనూ భూకంపం భయపెట్టింది. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైంది. చాలా ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 23 మంది గాయపడ్డారు. అదియమన్, మలత్యా ప్రావిన్స్‌లలో భూకంపం నమోదైంది. ఇదే ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కూలిపోయే దశలో ఉన్న బిల్డింగ్‌ల వద్ద ప్రజలెవరూ నిలబడొద్దని టర్కీ హెల్త్ మినిస్టర్ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. 11 కిలోమీటర్ల లోతు వరకూ భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.
(8月15日)東京付近でM5.5の地震が発生する可能性があります - https://t.co/9gnY4xO5Is pic.twitter.com/pRiyrfdfyC
— Japan Earthquakes (@earthquakejapan) August 11, 2023
అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో గత వారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. అఫ్గాన్ లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. తాజాగా సంభవించిన భూకంప కేంద్రాన్ని తజకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. హిందూకుష్ ప్రాంతంలో ఉత్తరం వైపు 36.38 డిగ్రీల అక్షాంశంలో, 70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు పాకిస్థాన్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో, ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ ప్రాంతాల్లో పలుమార్లు భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో పలుమార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల ప్రజలు భూప్రకంపనలకు భయపడి ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. అంతకు ముందు అండమాన్ నికోబార్ దీవులను భూకంపం వణికించింది. ఉదయం 5 :30 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టార్ స్కేలు పై 5.0 గా నమోదు అయ్యింది. ఇది భూమి లోపల 10 కిలో మీటర్ల లోతులో సంభవించడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.