కరాచీలోని షాపింగ్ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన 11 మంది!
Karachi Fire Accident: కరాచీలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ఆహుతయ్యారు.
Karachi Shopping Mall Fire Accident:
పాకిస్థాన్‌లో అగ్నిప్రమాదం..
పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు Dawn News వెల్లడించింది. ఇంకా కొంత మంది ఈ మంటల్లోనే చిక్కుకున్నట్టు సమాచారం. వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లో ఉన్న ఈ షాపింగ్ మాల్‌లో ఉదయం ఈ మంటలు చెలరేగినట్టు అక్కడి మీడియా తెలిపింది. స్థానిక ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. ఇప్పటి వరకూ 22 మందిని షాపింగ్ మాల్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీళ్లందరినీ స్థానిక మెడికల్ సెంటర్‌కి పంపి చికిత్స అందించారు. వాళ్లలో ఓ వ్యక్తి చికిత్స పొందుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే నాలుగు అంతస్తుల్లో ఉన్న బాధితులు బయటకు వచ్చారు. మిగతా ఫ్లోర్స్‌లో ఉన్న వాళ్లనూ ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తున్నారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం..ఉదయం 6.30గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
సీఎం దిగ్భ్రాంతి..
ఈ మాల్‌లో షాపింగ్ సెంటర్స్, కాల్ సెంటర్స్ ఉన్నాయి. భారీ ఎత్తున అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ షాపింగ్ మాల్‌కి వచ్చే రూట్‌ని క్లియర్ చేశారు. ఎలాంటి సహాయక చర్యలు అవసరమైనా వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మక్బూల్ బకర్ ఈ ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పారు. గత వారమే కొంత మంది ఎక్స్‌పర్ట్‌లో కరాచీలోని పలు బిల్డింగ్‌లని పరిశీలించారు. వీటిలో 90% మేర బిల్డింగ్‌లలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేల్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సరైన ఎగ్జిట్ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోగా ఈ ప్రమాదం జరిగింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply