Viral Video: కిటికీ తెరిచినందుకు గొడవ, బస్‌లో షూతో కొట్టుకున్న మహిళలు - వీడియో వైరల్
Viral Video: బెంగళూరులోని బస్‌లో ఇద్దరు మహిళలు షూతో కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Bengaluru Bus Viral Video: బెంగళూరులోని బస్సులో ఇద్దరు మహిళలు షూతో కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఫిబ్రవరి 8వ తేదీన ఈ ఘటన జరిగింది. బస్‌లోని ప్రయాణికులు ఈ గొడవనంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కిటికీ తెరిచే విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైందని...అది ఇలా షూతో కొట్టుకునేంత వరకూ వెళ్లిందని ప్రయాణికులు చెప్పారు. ఆ తరవాత వెనకాల ఉన్న వాళ్లూ ఒక్కసారిగా దాడి చేయడం మొదలు పెట్టారు. మొత్తంగా చాలా సేపటి వరకూ ఈ ఘర్షణ జరిగింది.
Two women in BMTC bus fighting over Sliding the Glass #Bengaluru pic.twitter.com/KTdlNELVnw
— Madhuri Adnal (@madhuriadnal) February 9, 2024
ప్రయాణికులు గట్టిగా అరిచారు. గొడవ ఆపాలని వారించారు. కానీ వాళ్లు పట్టించుకోకుండా అలాగే గొడవ పడ్డారు. కండక్టర్ కలగజేసుకోవాలని ప్యాసింజర్స్ పట్టుబట్టారు. వెంటనే వచ్చినా కండక్టర్ ఇద్దరూ బస్ దిగిపోవాలని వారించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఫ్రీ ట్రావెల్ అని హామీలు ఇస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని కొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.
Just Freebie Government things
— King Appu 𝕏 (@itsKingAppu) February 8, 2024
In Bengaluru,,,,
Two female passengers on a BMTC bus got into a heated verbal disagreement about sliding the window glass, and it got physical when they started shoving shoes at each other.
pic.twitter.com/Hd7JwgUtXi