అన్వేషించండి

Priyanka Gandhi: వయనాడ్‌ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ! రాహుల్ రాజీనామా చేస్తే ఇదే జరుగుతుందా?

Wayanad: వయనాడ్‌ ఎంపీగా రాహుల్ రాజీనామా చేస్తారని అక్కడి నుంచే ప్రియాంక గాంధీ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

Priyanka Gandhi to Contest From Wayanad: వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ రెండు చోట్లా విజయం సాధించారు. అయితే...ఆయన వయనాడ్‌ ఎంపీగా రాజీనామా చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే నిజమైతే అక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయం. ఈ ఉప ఎన్నికల బరిలోనే ప్రియాంక గాంధీ నిలబడతారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల్లో ఈ విషయం బాగానే చక్కర్లు కొడుతోంది. యూపీలోని రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోట. అందుకే అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగి వయనాడ్‌ నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. నిజానికి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ 2019 నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని దాదాపు అంతా ఖరారు చేసుకున్నారు. కానీ...చివర్లో రాహుల్ పేరునే ప్రకటించింది హైకమాండ్. ఆ సమయంలోనే మీడియా ప్రియాంకను ప్రశ్నించింది. ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించగా రాహుల్‌తో పాటు తాను కూడా పోటీ చేస్తే ప్రచారానికి సమయం ఎక్కువ కేటాయించలేమని వెల్లడించారు. ఇద్దరమూ చెరో చోట ప్రచారం చేయడం కన్నా ఒకే చోట చేయడం వల్ల పార్టీకి కలిసి వస్తుందని, అందుకే పోటీ చేయడానికి తాను ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు. 

స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక..

2022లో యూపీ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా ఆమె మాత్రం బరిలో దిగలేదు. ఆ సమయానికి యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరవాత ఎన్నికల్లో పాల్గొనాలన్న ఆలోచనే చేయలేదు ప్రియాంక గాంధీ. ఇన్నాళ్లకు మళ్లీ అదే ప్రచారం జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు ప్రియాంక. రాహుల్‌తో సమానంగా అన్ని చోట్లా క్యాంపెయిన్ చేశారు. యూపీలో ఈ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించింది. బీజేపీకి ఇండీ కూటమి షాక్ ఇచ్చింది. 43 చోట్ల విజయం సాధించింది. ఇదంతా ప్రచారం వల్లే సాధ్యమైందని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే...రెండు చోట్ల గెలిచిన రాహుల్ మాత్రం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి చవి చూసిన రాహుల్‌కి వయనాడ్‌ గెలుపు చాలా ఊరటనిచ్చింది. అలాంటి నియోజకవర్గాన్ని ఎలా వదులుకోవాలి అని ఆలోచనలో పడ్డారు. ఇక రాయ్‌బరేలీ విషయానికొస్తే అది కంచుకోట. ఇక్కడి ప్రజలు గాంధీ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎలా తప్పుకోవాలో అర్థం కాక సందిగ్ధంలో ఉన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి సమయంలోనే ఆయన వయనాడ్ ఎంపీగా రాజీనామా చేస్తారన్న వార్తలు చర్చకు దారి తీశాయి. ఊహాగానాలు నిజమై ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తే ఆమె గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ప్రియాంక గాంధీ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. 

Also Read: Kuwait Fire Tragedy: కువైట్ అగ్ని ప్రమాదం - 45 మంది మృతదేహాలతో కొచ్చిన్ చేరుకున్న ప్రత్యేక విమానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Embed widget