అన్వేషించండి

Ocean's Color: సముద్రం రంగులు ఎందుకు మారతాయి? దీని వెనకాల ఏమైనా మిస్టరీ ఉందా?

Ocean's Color: ఒక్కో ప్రాంతంలో సముద్రపు రంగు ఒక్కో విధంగా ఉంటుంది. ఎందుకిలా..?

Why does the sea change color: 

రంగు మారిన ఉప్పాడ సముద్రం..

ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఉప్పాడ సముద్రం రంగు (Sea Color) మారుతోందని ఈ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. "సముద్రం కూడా నీ కళ్లు నీలి సముద్రం పాట విందేమో అందుకే...ఇలా నీలంగా మారిపోయింది" అంటూ ఆ ట్వీట్‌లో కోట్ చేశారు. అదిగో అప్పుడు మొదలైంది చర్చ. అప్పటి వరకూ ఎరుపు రంగులో ఉన్న సముద్రం ఉన్నట్టుంది నీలం రంగులోకి మారిపోయింది. ఇదెలా సాధ్యమైంది..? సముద్రం నీలి రంగులోనే ఉండాలి కదా. ఇలా రంగులు ఎందుకు మారుతున్నట్టు..? పైగా ఇక్కడే కాదు. దేశాలను బట్టి సముద్రం రంగులూ మారుతున్నాయి. ఒకచోట పూర్తి నీలి రంగులోనే ఉండగా...మరో చోట కాస్త నల్లగా ఉంటుంది. ఇంకో చోట ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. 
ఈ రంగులు మారటంపై ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఉప్పాడ సముద్రం...ఆ చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. 

ఓషనోగ్రాఫర్‌లు ఏం చెబుతున్నారు? 

సముద్రం రంగులు మారటంపై నాసా ఓషనోగ్రాఫర్ (Oceanographer) గతంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సహజంగా మనం సముద్రం అనగానే "నీలం" రంగులోనే ఉండాలని,ఉంటుందని ఫిక్స్ అయిపోయాం. కానీ...ఆ రంగు మాత్రమే ఉండాలనే రూల్ ఏమీ లేదని నాసా ఓషనోగ్రాఫర్ కార్ల్ ఫెల్డ్‌మెన్ గతేడాది రీసెర్చ్ చేసి మరీ వెల్లడించారు. సముద్ర గర్భంలో ఏముంది అనే దానిపై..సముద్రం ఉపరితల రంగు ఆధారపడి ఉంటుందన్నది ఆయన చెప్పిన విషయం. ఇంకా సింపుల్‌గా అర్థం చేసుకునేందుకు ఓ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓ వాటర్ గ్లాస్ ఉందనుకుందాం. దానిపై నుంచి లైట్ వేశామనుకుందాం. పెద్దగా అబ్‌స్ట్రక్షన్స్‌ ఏమీ ఉండవు కనుక ఆ కాంతి రంగు నీటి ఉపరితలంపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడిదే ఉదాహరణను సముద్రానికి అన్వయించి చూద్దాం. సముద్రం లోతు చాలా ఎక్కువగా ఉంటే...సూర్యకాంతి అంత లోపల వరకూ చొచ్చుకుని వెళ్లలేదు. ఫలితంగా...ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. అందుకే...సముద్రం నీలి రంగులో కనిపిస్తుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు. సూర్యకాంతి లోపలకు వెళ్లటం లేదు. లాజిక్కే. అలాంటప్పుడు సముద్రం నీలి రంగులోనే ఎందుకు కనిపించాలి..? దీనికీ సైంటిస్ట్‌లు వివరణ ఇచ్చారు.

అదేంటంటే...సూర్యుడి నుంచి వచ్చే లైట్ స్పెక్ట్రమ్ భిన్న వేవ్‌లెంత్స్‌తో ఉంటుంది. వీటిలో లాంగ్ వేవ్‌లెంత్ ఉన్న రెడ్, ఆరెంజ్ రంగులు మన కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. బ్లూ, గ్రీన్‌ రంగుల వేవ్‌లెంత్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సముద్ర జలాన్ని సూర్యకాంతి తాకుతుందో...అప్పుడు ఆ లైట్ వాటర్ మాలెక్యూల్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. ఆ కాంతిని నీళ్లు గ్రహిస్తాయి. అంటే అబ్‌సార్బ్ చేస్తాయి. ఒకవేళ ఆ సముద్రపు నీటిలో వాటర్ తప్ప మరింకేవీ లేకపోతే...షార్టర్ వేవ్‌లెంత్‌లో ఉన్న నీలం లేదా ఆకుపచ్చ రంగులు సముద్ర ఉపరితలాన్ని ఢీకొట్టి...అదే రంగు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే...ఆ సముద్రం నీలం రంగులోనో, ఆకుపచ్చ రంగులోనే కనిపిస్తుంది. ఇక లాంగ్‌ వేవ్‌లెంత్ ఉన్న ఎరుపు రంగుని సముద్రపు నీరు అబ్‌సార్బ్ చేసుకుంటాయి తప్ప రిఫ్లెక్ట్ చేయవు. 

ఒక్కో చోట ఒక్కో రంగులో ఎందుకు..?

సముద్రపు లోతుతో పాటు సముద్ర గర్భంలో ఎలాంటి మెటీరియల్ ఉందనే దానిపై కలర్ మారుతూ ఉంటుందని ఓషనోగ్రఫీ చెబుతోంది. అట్లాంటిక్ సముద్రం చాలా చోట్ల డార్క్‌ బ్లూ రంగులో కనిపిస్తుంది. అదే ఉష్ణమండలాల్లోని సముద్రాల్లోని నీరు Sapphire-Blueరంగులో ఉంటాయి. గ్రీస్‌లో అయితే...సముద్రపు నీరు Blue-Green మిశ్రమమైన Turquoise రంగులో కనిపిస్తాయి. అందుకు కారణం...అక్కడి సముద్ర గర్భంలో వైట్ సాండ్, వైట్ రాక్స్ ఉంటాయి కనుక. Blue కలర్ సముద్ర గర్భంలోకి వెళ్లినప్పుడు అక్కడి వైట్ సాండ్‌ను, వైట్ రాక్‌ను తాకి..పైకి రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే...అక్కడి నీరు అలా కనిపిస్తాయి. ఇక సముద్రం రంగుకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. 

ఆ మొక్కలూ కారణమేనా..? 

మనకు జబ్బు చేస్తే డాక్టర్లు ఎలాగైతే టెస్ట్‌లు చేసి రిపోర్ట్‌లు చూసి ఏమైందో చెబుతారో...సముద్రానికీ అలాంటి డాక్టర్లు ఉంటారు. వాళ్లనే ఓషనోగ్రాఫర్‌లు అంటారు. వాళ్లు చెప్పే ఆసక్తికరమైన విషయం ఏంటంటే...రంగు ఆధారంగా సముద్రం ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పొచ్చట. సముద్రంలోపల ఎన్నో జీవరాశులుంటాయి. మనం చేరుకోలేని లోతులోనూ ఏదో ఓ జీవజాతి మనుగడ సాగిస్తూ ఉంటుంది. వీటికి ప్రాణగండం తీసుకొచ్చే...ఎన్నో విషపూరిత రసాయనాలు సముద్రంలో చేరుతున్నాయి. మనమే అలా పాడు చేస్తున్నాం. ఇంకొన్ని చోట్ల ఎన్నో నిక్షేపాలుంటాయి. సముద్ర గర్భంలోని వాతావరణం ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేది....మన కంటికి కనిపించే రంగు ద్వారా తెలిసిపోతుందని ఓషనోగ్రాఫర్స్‌ చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎక్కడెక్కడైతే రసాయనాలు, ఇతరత్రా విషపూరిత పదార్థాలుంటాయో..అక్కడ బ్రౌన్‌ కలర్‌లోనూ, సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడే Phytoplankton లాంటి మొక్కలు ఎక్కువగా ఉన్న చోట ఆకుపచ్చ, ఎరుపు రంగులోనూ కనిపిస్తుంది. ఈ మొక్కలు ఎక్కువగా ఉన్న సముద్రమూ నీలి రంగులో కనిపిస్తుంది.

వాతావరణ మార్పులు కూడా...సముద్రపు రంగుని డిసైడ్ చేస్తున్నాయి. 50 ఏళ్లలో సముద్రపు నీళ్లలో ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇందుకు కారణంగా...మితిమీరిన ఉష్ణోగ్రతలు. ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు నీటిలో వేడి పెరుగుతుంది. ఫలితంగా...ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది. అంతే కాకుండా...కొన్ని చోట్ల Phytoplankton మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మొక్కల్ని తినే చిన్న జీవరాశుల సంఖ్య తగ్గిపోవటం వల్లే ఈ సమస్య. ఎప్పడైతే...ఈ మొక్కల సంఖ్య ఎక్కువవుతుందో...అవి నీటిలో డికంపోజ్ అయి ఆక్సిజన్‌ను తగ్గించేస్తాయి. ఫలితంగా...సముద్రపు రంగు మారిపోతుంది. సో...సముద్రం కలర్‌ మారటం వెనక ఇంత కథ ఉందన్నమాట. 

Also Read: Walls Have Ears: గోడలకు చెవులుంటాయ్ అనే సామెత వెనక ఇంత చరిత్ర ఉందా?

Also Read: Face Reading: ముఖం చూసి ఎలాంటి వాళ్లో చెప్పొచ్చా? ఫేస్‌ రీడింగ్‌కి సైంటిఫిక్‌ రుజువులున్నాయా?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget