అన్వేషించండి

Joe Biden: ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ తప్పుకోడానికి కారణాలివేనా?

US Election 2024: అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే డెమొక్రాట్‌లు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు.

Joe Biden Steps Out of President Race: అనుకున్నట్టే జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడు నాలుగు రోజులుగా ఆయన తప్పుకుంటారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఓ ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్టుగానే ఆ ప్రకటన వచ్చేసింది. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ప్రెసిడెంట్ రేసులోకి వచ్చారు. అయితే...బైడెన్ ఈ రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఆయన ప్రవర్తన కారణంగా ఈ ఏడాది మొదటి నుంచే ఈ డిబేట్ మొదలైంది. నిజానికి ఏప్రిల్ నెలలోనే ట్రంప్‌తో డిబేట్‌ జరగాల్సింది. కానీ అదే సమయంలో జో బైడెన్ యూరప్‌కి వెళ్లొచ్చారు. దాదాపు రెండు సార్లు అక్కడ పర్యటించారు. ఈ షెడ్యూల్ కారణంగా బాగా అలిసిపోయారు. 

అంతకు ముందు ఏప్రిల్‌లోనే ట్రంప్‌తో డిబేట్‌ ఉంటుందని ప్రకటించారు బైడెన్. కానీ ఆయన ఆరోగ్యం సహకరించలేదు. ఫలితంగా అది కాస్తా వాయిదా పడింది. అప్పటి నుంచే ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది. ఇలా అలిసిపోయే వ్యక్తి అధ్యక్ష పదవికి ఎలా సరిపోతారంటూ ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. మొత్తానికి జూన్ 27న ట్రంప్‌తో డిబేట్ జరిగింది. ట్రంప్‌ ఎన్ని విమర్శలు చేసినా బైడెన్ అందుకు గట్టిగా బదులు చెప్పలేకపోయారు. దాదాపు గంటన్నర పాటు డిబేట్ జరగ్గా బైడెన్ అరకొరగా మాట్లాడారు. కొన్ని సార్లు తడబడ్డారు. ఏం మాట్లాడుకున్నారో మర్చిపోయారు. ఆ తరవాత విమర్శలు ఎక్కువయ్యాయి. 

ఆయన ఆరోగ్యం గురించి దేశమంతా చర్చ జరుగుతుంటే బైడెన్ మాత్రం తాను చాలా ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ తరవాత మళ్లీ ఆ వ్యాఖ్యలతో సంబంధం లేని కామెంట్స్ చేశారు. ఒక్కోసారి స్టేజ్‌పై ఉన్నప్పుడు నిద్ర ముంచుకొచ్చేస్తోందని చెప్పారు. హెల్త్ బాలేదన్న విషయం నిజమేనని అంగీకరించారు. అంతే కాదు. సాయంత్రం 4 దాటాకా ఏ పనిపైనా ఫోకస్ పెట్టలేకపోయారు. షెడ్యూల్‌ని అందుకు తగ్గట్టుగా మార్చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల ప్రచారంపైనా ఇది ఎఫెక్ట్ చూపించింది. ఆ తరవాత ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఆయనకు పొలిటికల్‌గా బూస్ట్ ఇచ్చింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొన్ని పోరాడతానంటూ ప్రకటించారు ట్రంప్. అప్పటికే బైడెన్ తన ప్రచారాన్ని చాలా చప్పగా సాగిస్తున్నారు. ఇటు ట్రంప్‌ మాత్రం దూకుడు పెంచారు. సరిగ్గా అదే సమయంలో దాడి జరగడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఆ వెంటనే బైడెన్‌కి కొవిడ్ సోకింది. ప్రచారం నుంచి పూర్తిగా తప్పుకుని ఐసోలేట్ అవ్వాల్సి వచ్చింది. అలా ప్రచారానికి తెరపడింది. ఈలోగా ట్రంప్‌ పుంజుకున్నారు. జులై 21 వ తేదీన జో బైడెన్ అధికారికంగా తన ప్రచారానికి ముగింపు పలికారు. డెమొక్రాట్‌ల నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం వల్ల ఆయన రేసు నుంచి తప్పుకోక తప్పలేదు. ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలు వ్యక్తమవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఎగ్జిట్ ఇచ్చారు. 

Also Read: Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌, భారత సంతతి వ్యక్తి కమలా హ్యారిస్‌ లక్కీ ఛాన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget