Covid-19 Cases Spike: కరోనా కేసులు పెరగడానికి కారణాలివే, వివరించిన నిపుణులు
Covid-19 Cases Spike: కరోనా కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయో నిపుణులు వివరించారు.
Covid-19 Cases Spike:
నిపుణులు ఏమంటున్నారంటే..
భారత్‌లో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటం కలవర పెడుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే...ఇప్పటికే దేశ జనాభాలో 90% మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అయినా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోంది..? ఇప్పుడిదే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్‌లు తీసుకున్న మాట వాస్తవమే కానీ...ఆ టీకాలు SARS-CoV-2 ఇన్‌ఫెక్షన్‌లను అడ్డుకున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకూ తీసుకున్న టీకాలు...ఈ వేరియంట్‌పై పని చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. సార్స్ కన్నా వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. టీకాలు ఇచ్చిన ఇమ్యూనిటీని కూడా ఛేదించి మరీ సోకుతోంది. అందుకే...వ్యాక్సిన్‌లు తీసుకున్న వాళ్లు కూడా ఈ వేరియంట్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరగడానికి మరో కారణాన్నీ వివరిస్తున్నారు ఎక్స్‌పర్ట్‌లు. కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించాయి. ఎలాంటి వేరియంట్ వచ్చినా ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు అందరూ ఈ ప్రికాషనరీ డోసులు తీసుకోవడం మంచిదని చెప్పాయి. కానీ చాలా మంది బూస్టర్ డోస్‌లు తీసుకోలేదు. ప్రస్తుతం CoWIN పోర్టల్ ప్రకారం...ఏప్రిల్ 9వ తేదీ నాటికి 22 కోట్ల మందికి పైగా ప్రికాషనరీ డోసులు తీసుకున్నారు. దేశంలో 20% మంది అర్హులు ప్రికాషనరీ డోసులు తీసుకున్నారు. కరోనా ఇక పూర్తిగా పోయిందని, జాగ్రత్తలు పాటించకపోయినా పర్లేదని భావిస్తున్నారు చాలా మంది. బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్క్‌లు లేకుండానే తిరుగుతున్నారు. ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలనీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించాయి.
"ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి కారణం...ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16. గత వేరియంట్‌ల కన్నా ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇమ్యూనిటీని ఛేదిస్తోంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకూ ఇది సోకుతోంది. ప్రికాషనరీ డోస్‌లు తీసుకోవడంలో నిర్లక్ష్యమూ ఈ కేసుల పెరగడానికి మరో కారణం. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడడం, వేడుకలు చేసుకోవడం మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వాల సూచనలను కొందరు పట్టించుకోడం లేదు"
- డాక్టర్ అనురాగ్ సక్సేనా, ప్రైమస్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్, ఢిల్లీ
ప్రజలు కరోనా జాగ్రత్తలు పట్టించుకోకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)అసహనం వ్యక్తం చేసింది. కొవిడ్ పూర్తిగా పోలేదని, ఇంకా మనతోనే ఉందని హెచ్చరిస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని వెల్లడించింది.
"కేసులు పెరగడానికి రెండు కారణాలున్నాయి. మనం జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవడం మొదటి కారణమైతే...కరోనా పూర్తిగా పోయిందని నిర్లక్ష్యం వహించడం మరో కారణం. ఈ వైరస్ మన భారత్‌ను ఇంకా వీడలేదు. అందుకే...మునుపటిలా మనం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించాలి"
డాక్టర్ సంజయ్ దాల్, మాక్స్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్
Also Read: PM Modi Karnataka Visit: స్పోర్ట్స్ లుక్‌లో మెరిసిన ప్రధాని మోదీ, టైగర్ రిజర్వ్‌లో సఫారీ