Tallest Statues in India: భారతదేశంలో అత్యంత ఎత్తైన విగ్రహాలు సంగతి తెలుసా ?
Tallest Statues in India: భారతదేశంలో ఎన్నెన్నో ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. అయితే అత్యంత ఎత్తుగా ఉన్న విగ్రహాలు ఎక్కడెక్కడ, ఎన్ని ఉన్నాయో చూడండి
Tallest Statues in India: భారతదేశం ఎన్నో ఎత్తైన విగ్రహాలకు నిలయంగా ఉంది. గుజరాత్‌లో 500 అడుగుల ఎత్తుతో నిర్మించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం నుంచి హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం వరకు మరెన్నో ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి, వాటి ఎత్తు ఎంత వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)
గుజరాత్ లో 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తుతో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీగా గుర్తింపు పొందింది. అంతేకాదండోయ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా కూడా పేరొందింది. దీన్ని నిర్మించడానికి 566 నెలల సమయం పట్టిందట. నర్మదా డ్యామ్‌కు ఎదురుగా ఉంటుందీ విగ్రహం. అక్టోబర్ 31వ తేదీ 2018వ సంవత్సరంలో ఆ విగ్రహాన్ని ప్రారంభించారు.
2. సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో 216 అడుగుల ఎత్తుతో సమతా మూర్తి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 ఫిబ్రవరి 2022న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఇది పంచలోహాలతో రూపొందించారు. కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది.
3. అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్ మధ్యలో ట్యాంక్‌బండ్ పక్కనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 125 అడుగుల విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. ఎత్తులో ఇది మూడో అతి పెద్ద విగ్రహం కానుంది.
4. శివుడి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ బిలీఫ్)
రాజస్థాన్ లోని నాథ్‌ద్వారా వద్ద నిర్మించిన శివుడి విగ్రహం 112 మీటర్ల ( 369 అడుగులు) ఎత్తు ఉంటుంది. కాళ్లు ముడుచుకుని కూర్చున్న శివుడి విగ్రహం ఇండియాలోనే అత్యంత ఎత్తైన రెండో విగ్రహంగా పేరొందింది. అలాగే అక్టోబర్ 29 2022 న దీనిని ప్రారంభించే సమయానికి.. ఇది ప్రపంచంలో 4వ ఎత్తైన విగ్రహం. దీన్ని స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ అని పిలుస్తుంటారు.
5. హనమాన్ విగ్రహం
ఏపీలోని వంశధార నది సమీపంలో ఉన్న 52 మీటర్ల (171 అడుగుల) ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ హనుమాన్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంగా పేరొందింది. 2020లో ప్రారంభించిన ఈ విగ్రహం భారతదేశంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా నిలిచింది.
6. పంచముఖ హనుమాన్ విగ్రహం
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కునిగల్ లో 49 మీటర్లు (161 అడుగల) ఎత్తుతో ఈ పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంది. 2022లో స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పంచముఖ హనుమాన్ గా ఇది పేరొందింది.
7. ముతుమలై మురుగన్ విగ్రహం
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో 44.5 మీటర్ల (146 అడుగుల) ఎత్తుతో ముతుమలై మురుగున్ విగ్రహం ఉంది. ఇది 2022లో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహంగా పేరొందింది.
8. వేష్ణో దేవి విగ్రహం
ఉత్తర్ ప్రదేశ్ లోని బృందావన్ లో 43 మీటర్ల (141 అడుగుల) ఎత్తుతో వైష్ణో దేవీ విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని 2010లో నిర్మించారు.
9. వీర అభయ ఆంజనేయ హనుమాన్ స్వామి
ఏపీలోని విజయవాడ సమీపంలోని పరిటాల పట్టణంలో 41 మీ (135 అడుగులు) ఎత్తుతో వీర అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. 2003లో స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండో ఆంజనేయ స్వామి విగ్రహంగా పేరొందింది.
10. తిరువల్లువర్ విగ్రహం
తమిళనాడులోని కన్యాకుమారి వద్ద 40.5 మీర్లు(133 అడుగుల) ఎత్తులో ఈ తిరువల్లువర్ విగ్రహం ఉంది. 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ విగ్రహం తిరుక్కురల్‌లోని మూడు విభాగాలను సూచిస్తుంది. అవి ధర్మం (38 అధ్యాయాలు), సంపద (70 అధ్యాయాలు) మరియు ప్రేమ (25 అధ్యాయాలు). ఈ విగ్రహం 95 అడుగుల (29 మీ) ఎత్తు , 38 అడుగుల (11.5 మీ) పీఠంపై ఉంది. ఎత్తైన రాతి శిల్పం విగ్రహం 3681 రాళ్లను కలిగి ఉంది.
11. తథాగత త్సాల్
దక్షిణ సిక్కింలోని రావంగ్లాలోని బుద్ధ పార్కులో 39 మీటర్లు (128 అడుగుల) ఎత్తులో బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తైన బుద్ధుడి విగ్రహంగా పేరొందింది. 2006 నుంచి 2013 మధ్య నిర్మించారు. ఆ రావంగ్లా హిమాలయన్ బౌద్ధ సర్క్యూట్‌లో భాగం.
12. ధ్యాన బుద్ధ విగ్రహం
ఏపీలోని ధ్యాన బుద్ధ విగ్రహం 38.1 మీటర్ల (125 అడుగుల) ఎత్తులో ఉంటుంది. అమరావతిలో కృష్ణా నది ఒడ్డున కూర్చున్న భంగిమలో ఈ విగ్రహం ఉంటుంది. 2015లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.