అన్వేషించండి

ఇలా అయితే ఇండియా నుంచి వెళ్లిపోతాం, ఐటీ రూల్స్‌పై వాట్సాప్ తీవ్ర అసహనం

WhatsApp: ఐటీ చట్టంలోని రూల్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాట్సాప్ ఇలా అయితే ఇండియా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

WhatsApp Threatens to Exit India: వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ యాప్‌లోని ఎన్‌క్రిప్షన్‌ని బ్రేక్‌ చేయాలని చెబితే భారత్‌లో ఇకపై సేవలు అందించడం కష్టమే అని తేల్చి చెప్పింది. ఢిల్లీహైకోర్టులో ఐటీ చట్టంలో సవరణలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ విచారణ సమయంలో వాట్సాప్ ఈ వ్యాఖ్యలు చేసింది. 2021 నాటి ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌కి సంబంధించిన నిబంధనలను మెటా సవాల్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏదైనా మెసేజింగ్ సర్వీస్‌లు అందిస్తుంటే అందులోని మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించాలని ఈ నిబంధనలు తేల్చి చెబుతున్నాయి. అంటే...మెసేజ్‌ల మూలాలను గుర్తించడం. కంప్యూటర్ రీసోర్స్‌ల ద్వారా ఆరిజినేటర్‌ని గుర్తించాలని ఐటీ చట్టంలో స్పష్టంగా ప్రస్తావించారు. అయితే...దీనిపై వాట్సాప్‌ అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థ తరపున వాదించిన అడ్వకేట్ తేజస్ కరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవసీ ఉంటుందనే కారణంగానే చాలా మంది వాట్సాప్‌ని వినియోగిస్తున్నారని, ఇందులో End to End Encryption ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ నిబంధన ప్రకారం మెసేజ్‌ల మూలాలు గుర్తించాలంటే ఈ ఎన్‌క్రిప్షన్‌ని బ్రేక్ చేయాల్సి ఉంటుందని కోర్టుకి వెల్లడించారు. 

అదే జరిగితే భారత్‌లో సేవలు కొనసాగించలేమని స్పష్టం చేశారు. ఈ నిబంధన వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగిస్తోందని వాదించారు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే చట్టంలో ఇలాంటి రూల్స్ పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఈ చట్టంలో ఉన్నట్టుగా చేయాలంటే వాట్సాప్‌ ఏటా లక్షలాది మెసేజ్‌లను స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తరపున న్యాయవాది వాదించారు. ఎప్పుడు ఏ మెసేజ్‌ని డీక్రిప్ట్ చేయమని చెబుతారో తెలియనప్పుడు, అన్ని మెసేజ్‌లనూ స్టోర్ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంతకు ముందు చట్టంలో ఇలాంటి నిబంధన లేదని వాదించారు. ఆ సమయంలో ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. ఇలాంటి నిబంధన ఇంకెక్కడైనా ఉందా అని అడిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రూల్ లేదని తేజస్ కరియా స్పష్టం చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Elephant Calf Maya to  Vantara: ఏనుగు పిల్లను కాపాడేందుకు ముందుకొచ్చిన వంతారా.. ప్రత్యేక విమానంలో కేరళ నుంచి జామ్‌నగర్‌కు మాయ..!
ఏనుగు పిల్లను కాపాడేందుకు ముందుకొచ్చిన వంతారా.. ప్రత్యేక విమానంలో కేరళ నుంచి జామ్‌నగర్‌కు మాయ..!
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget