Vegetarian Bodybuilder: 42 ఏళ్లకే కన్నుమూసిన ప్యూర్ వెజ్ బాడీ బిల్డర్ - అసలు కారణం షాకిచ్చేదే!
Varinder Ghuman: బాడీని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మాంసాహారం తినాలని అనుకుంటారు. కానీ వారిందర్ గుమాన్ మాత్రం పూర్తిగా శాకాహారి. కానీ ఆయన 42 ఏళ్లకే చనిపోయారు.

vegetarian bodybuilder Varinder Ghuman death : పంజాబ్‌కు చెందిన ప్రముఖ బాడీబిల్డర్, నటుడు, 'భారతదేశ అర్నల్డ్ ష్వార్జెనెగర్'గా అందరూ పిలిచే వారిందర్ సింగ్ ఘుమాన్ (42) గురువారం హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. భుజం నొప్పితో ఫోర్టిస్ హాస్పిటల్‌లో చిన్న శస్త్రచికిత్సకు చేయించుకున్న ఆయనకు శస్త్రచికిత్స సమయంలో కార్డియాక్ అరెస్ట్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. వెజిటేరియన్ డైట్‌తో అందరినీ ఆకట్టుకున్న ఘుమాన్ మరణం ఫిట్‌నెస్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేిసంది.
అక్టోబర్ 9న ఘుమాన్ భుజం నొప్పితో ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లారు. చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. ఇది సాధారణ చిన్న చికిత్సగా భావించారు. అదే రోజు డిశ్చార్జ్ అవ్వాలని ప్లాన్ చేసినట్లు మేనేజర్ ఆయన యాద్విందర్ సింగ్ తెలిపారు. అయితే, ఆపరేషన్ సమయంలో సమయంలో ఆకస్మికంగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో డాక్టర్లు ప్రాణాలు కాపాడలేకపోయారు. ఘుమాన్ మేనేజర్ "అది సాధారణ ప్రొసీజర్ మాత్రమే, ఎవరూ ఊహించలేదు" అని దిగ్భ్రాంతికి గురయ్యాడు.
డీబిల్డర్లలో భారీ బరువులు ఎత్తడం, స్టెరాయిడ్‌లు లేదా అధిక ప్రొటీన్ డైట్ వల్ల హృదయ సమస్యలు పెరగవచ్చు. అయితే, ఘుమాన్ వెజిటేరియన్‌గా ఉండటం వల్ల ఈ కారణాలు తక్కువగా ఉండవచ్చని, కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ బారిన ఎవరైనా పడవచ్చని అంటున్నారు. 1982/83లో పంజాబ్‌లోని గుర్దాస్పూర్‌లో జన్మించిన ఘుమాన్ 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో, 130 కేజీల బరువుతో ప్రపంచంలో మొదటి వెజిటేరియన్ ప్రొఫెషనల్ బాడీబిల్డర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి, మిస్టర్ ఏషియాలో రన్నరప్ అయ్యారు. భారతదేశంలో మొదటి IFBB ప్రో కార్డ్ పొందినవారిగా చరిత్ర సృష్టించారు. అర్నల్డ్ ష్వార్జెనెగర్ ఆయనను ఆసియాలో తన హెల్త్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు.
సినిమా రంగంలో కూడా మెరిసిన ఘుమాన్ 2012లో పంజాబీ సినిమా కబడ్డీ వన్స్ అగైన్ లో లీడ్ రోల్ పోషించారు. 2014లో హిందీ సినిమా రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్‌బన్స్ లో కీలకపాత్ర పోషించారు. 2023లో సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 లో షకీల్ పాత్రలో కనిపించారు. జలంధర్‌లో జిమ్ నిర్వహిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లకు వర్కౌట్ వీడియోలు, మోటివేషనల్ కంటెంట్ పోస్ట్ చేసేవారు. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవల నుకున్నారు.
पंजाबी अभिनेता और बॉडीबिल्डर Varinder Singh Ghuman का हार्ट अटैक से अमृतसर में निधन!
— Mem sahab (@memsahab_) October 10, 2025
‘टाइगर 3’ एक्टर और मिस्टर इंडिया विजेता की मौत से फिटनेस जगत में शोक की लहर#VarinderSinghGhuman #heartattack pic.twitter.com/9Awb0bVwPo
ఘుమాన్ మరణం పంజాబ్ రాజకీయ, సినిమా, ఫిట్‌నెస్ లోకాల్లో దిగ్భ్రాంతి సృష్టించింది. ఘుమాన్ వెజిటేరియన్ డైట్‌తో ప్రపంచ స్థాయి బాడీబిల్డింగ్‌లో విజయం సాధించి, భారతీయ యూత్‌కు మార్గదర్శకుడు. "మాంసాహారం లేకుండా కూడా మెగా ఫిజిక్ సాధ్యమే" అనే సందేశాన్ని వ్యాప్తి చేశారు. ఆయన మరణం ఫిట్‌నెస్ కమ్యూనిటీలో హృదయ ఆరోగ్యం గురించి చర్చలకు దారితీసింది.





















