News
News
X

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ -2 మూవీలో హీరో జూలింగ్వలిజం కాన్సెప్ట్ గురించి చెబుతాడు. మన ఎమోషన్స్‌ని జంతువులకు అర్థమయ్యేలా ట్రాన్స్‌మిట్ చేయటమే ఈ కాన్సెప్ట్ ఉద్దేశం.

FOLLOW US: 

Karthikeya 2 Zoolingualism: 

జూలింగ్వలిజం అంటే..

కార్తికేయ-2 సినిమా చూసిన వారందరికీ హీరో ఇంట్రో సీన్ గుర్తుండే ఉంటుంది. పాము పట్టుకునేందుకు ఓ చిన్న టెక్నిక్ యూజ్ చేస్తాడు హీరో. సింపుల్‌గా చేయి నేలపై ఆనించి ఓసారి చిటికేస్తాడు. అంతే. వెంటనే పాము వచ్చి చేతికి చుట్టుకుంటుంది. చుట్టుపక్కల వాళ్లు ఇది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడే హీరో ఫ్రెండ్ ఒకరు "ఇదెలా సాధ్యం" అని క్వశ్చన్ చేసినప్పుడు హీరో ఓ కాన్సెప్ట్ చెప్తాడు. అదే జూలింగ్వలిజం ( Zoolingualism). "నీకేమీ హాని చేయను అని దానికి అర్థమైన భాషలో చెప్పాను" అని ఆ హీరో చెప్పే డైలాగ్‌ను మనం ఇప్పుడు కాస్త డీకోడ్ చేద్దాం. అసలు జూలింగ్వలిజం అంటే ఏంటి..? అఫ్‌కోర్స్ ఇదేం కొత్త కాన్సెప్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే...మనం పిల్లుల్ని, కుక్కల్ని, పక్షుల్ని పెంచుకుంటాం. మనకి జంతువులకు మధ్య కమ్యూనికేషన్‌ అంత సులువుగా బిల్డ్ అవదు. రోజూ వాటితో మాట్లాడుతూ, ఏదో ఓ Instruction ఇస్తూ ఉంటే క్రమక్రమంగా అవే మన దారికి వచ్చేస్తాయి. ఇదెలా సాధ్యపడుతుంది..? మన మాటలు, ఎమోషన్స్‌ వాటికి ఎలా అర్థమవుతాయి..? అనే విషయాలు చెప్పేదే జూ లింగ్వలిజం. 

ఎమోషన్‌ని ట్రాన్స్‌మిట్ చేయటం.. 

మన ఎమోషన్‌ని అర్థమయ్యేలా జంతువులకు చెప్పటం చాలా గొప్ప ఆర్ట్. అది అంత ఈజీ కాదు. మన పల్స్‌ రేట్ మన కంట్రోల్‌లో ఉండాలి. వాటికి ఏ హానీ చేయమని హామీ ఇచ్చేలా మన బాడీ లాంగ్వేజ్ మారిపోవాలి. జంతువుల కళ్లలోకి కళ్లు పెట్టి చూడాలి. ఆ చూపుల్లో వాటికి నమ్మకం కనిపించాలి. అప్పుడు అవి మన మాట వింటాయి. మనం చెప్పినట్టు చేస్తాయి. దాదాపు ఇది హిప్నటిజం లాంటిదే కానీ...ఆ పదం కాస్త నెగటివ్‌ సెన్స్‌లో వాడుతున్నాం కాబట్టి ఆ మాట అనకపోవటమే బెటర్. జూలింగ్వలిజం అనేది కేవలం జంతువులతో మన అటాచ్‌మెంట్‌ను పెంచుకోవటం కోసమే. అవి ఏ బెరుకూ లేకుండా మనతో పాటు జీవించే అవకాశం కల్పించటమే ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం. మరో విషయం ఏంటంటే...జంతువు ప్రవర్తనను కాస్త అటు ఇటుగా అయినా మనం ఇమిటేట్ చేయగలగాలి. అవి చేసే సౌండ్స్‌నీ మనం గ్రహించాలి. అలాంటి సౌండ్స్ చేస్తూ వాటికి దగ్గరవాలి. కొన్ని సందర్భాల్లో ఏమీ మాట్లాడకుండానే కేవలం మానసికంగా వాటికి దగ్గరవ్వచ్చు. కార్తికేయ-2 సినిమాలో హీరో పాముని పట్టుకునే సీన్‌లో చేసింది ఇదే. 

హాలీవుడ్ సినిమాల్లో..

మనం ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో చూసుంటాం. వాటిలో ఈ జూలింగ్వలిజం కాన్సెప్ట్‌తో చాలానే మూవీస్ వచ్చాయి. కింగ్‌కాంగ్, లయన్ కింగ్, How To Train Your Dragon,The birds ఇలా ఎన్నో. కేవలం సైగలతోనే వాటిని కంట్రోల్ చేస్తూ ఎమోషనల్‌గా వాటికి కనెక్ట్‌ అయిపోతుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మచ్చిక చేసుకోవటం. అయితే..జంతువుల మేధస్సుని బట్టి మనుషులతో వాటి కమ్యూనికేషన్ ఎంత వరకూ ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. జూలింగ్వలిజంలో మాస్టర్స్‌ మాత్రం అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే వాటితో మాట్లాడతారు. వాటి ఎమోషన్స్‌ని అర్థం చేసుకుంటారు. అందుకు తగ్గట్టుగా రెస్పాండ్ అవుతారు. ఏ భాషలోనైనా సరే తడుముకోకుండా అప్పటికప్పుడు 
మాట్లాడగలగటాన్ని "Omnilingualism" అంటారు. జూ లింగ్వలిజం అనేది...ఆమ్నిలింగ్వలిజానికి సబ్‌ పవర్‌గా చెబుతుంటారు. ఈ జూ లింగ్విలిజంలో ఎక్స్‌పర్ట్‌ అయితే...ఆ తరవాతి స్టేజ్ జూపతి (Zoopathy). ఒకటి కన్నా ఎక్కువ జంతువుల్ని మన యాక్షన్స్‌తో కంట్రోల్ చేయ గలిగే స్కిల్ ఇది. కాకపోతే...జంతువుల్ని హిప్నటైజ్ చేసి కావాలనే టార్గెటెడ్ వ్యక్తులపైనా ఉసిగొల్పే ప్రమాదముంటుంది. అందుకే...ఇది చాలా డేంజరస్ అని చెబుతుంటారు. మనుషుల్ని మోస్ట్ అడ్వాన్స్‌డ్ యానిమల్‌ అని డిఫైన్ చేస్తుంటారు. అంటే...జంతువులను మచ్చిక చేసుకోవటం మనుషులకు పెద్ద కష్టమేమీ కాదన్నమాట. ఎందుకంటే మన మూలాలు ఉన్నది వాటిలోనే కదా మరి.

Also Read: Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Published at : 19 Aug 2022 04:28 PM (IST) Tags: Karthikeya 2 animals Karthikeya-2 What is Zoolingualism Omnilingualism

సంబంధిత కథనాలు

Minister Jogi Ramesh : సత్య కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకో, నీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh : సత్య కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకో, నీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు- మంత్రి జోగి రమేష్

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

YSR Kalyanamasthu : రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు మేజర్లే-జువైనల్ కోర్టు తీర్పు

Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు మేజర్లే-జువైనల్ కోర్టు తీర్పు

Watch Video: మోదీ మానవత్వం- కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారి!

Watch Video: మోదీ మానవత్వం- కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారి!

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ