News
News
X

Weather Updates: ఏపీలో నాలుగు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల వరకు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఏపీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో పశ్చిమ / నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఏపీలో పలు చోట్ల రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక రాయలసీయలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు లేదా తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రేపు (శనివారం), ఎల్లుండి (ఆదివారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. 

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా కారణంగా తెలంగాణ‌లో నేడు (సెప్టెంబర్ 17) పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావార‌ణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ‌ కేంద్రం తెలిపింది. భూపాల్ ప‌ల్లి, ములుగు, ఆదిలాబాద్, పెద్ద‌ప‌ల్లి, కొమురంభీమ్, మంచిర్యాల‌, జ‌గిత్యాల‌ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది. 

మండుతున్న ఎండలు.. 
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు భారీ ఎండ అంతలోనే చిరుజల్లులు పడటం వంటివి జరుగుతున్నాయి. ఇక నిన్న (సెప్టెంబర్ 16) ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా తిరుపతిలో 37.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. నెల్లూరులో 37.5 డిగ్రీల సెల్సియస్, కావలిలో 37.2 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 36.5 డిగ్రీలు, కడపలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. 

Also Read: Horoscope Today: ఈ రాశులవారు రిస్క్ తీసుకోవద్దు..వారు కొత్తగా ప్రారంభించాలనుకునే పనుల కోసం ప్రణాళికలు వేసుకునేందుకు ఈ రోజు శుభ సమయం

Also Read: Petrol-Diesel Price, 17 September 2021: ప్రధాన నగరాల్లో స్థిరంగా ఇంధన ధరలు... తెలంగాణలో తగ్గి, ఏపీలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ్టి ధరలు ఇలా...

Published at : 17 Sep 2021 06:39 AM (IST) Tags: telangana rains andhrapradesh rains rains in ap weather alert rain alert weather alert today floods in hyderabad

సంబంధిత కథనాలు

Krishna District: భార్యను కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు

Krishna District: భార్యను కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు

CJI UU Lalit: 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్ లలిత్ నియామకం

CJI UU Lalit: 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్ లలిత్ నియామకం

Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Border Love Story :  ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

Crypto Tax In India: క్రిప్టోపై పన్నులు నియంత్రణకా? అవగాహన పెంచడానికా ?

Crypto Tax In India: క్రిప్టోపై పన్నులు నియంత్రణకా? అవగాహన పెంచడానికా ?

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

Mohan babu : షిరిడి కన్నా తమ గుడే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Mohan babu :  షిరిడి కన్నా తమ గుడే గొప్పంటున్న మోహన్ బాబు -  ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు