Weather Update: రుతుపవనాలు తిరుగుముఖం, తెలంగాణలో శీతల గాలులు- తగ్గనున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి కాలం ప్రారంభమైంది. మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి వేళల్లోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. రుతుపవనాలు తిరుగు ముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వేస్తున్నాయి.
రాష్ట్రంలో చలి కాలం ప్రారంభమైంది. మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి వేళల్లోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. రుతుపవనాలు తిరుగు ముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వేస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. ఉదయాన్నే పొగ మంచు కమ్మేస్తోంది. హనుమకొండలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు తగ్గి... కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదు అయింది.
అదిలాబాదులో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. మిగిలిన జిల్లాల్లోనూ కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. పగటివేల హనుమకొండ, మెదక్, రామగుండంలలో ఉష్ణోగ్రతల తగ్గాయి. ఖమ్మంలో మాత్రం సాధారణంగా 3.3 డిగ్రీలు అధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు నమోదు అయింది. హైదరాబాద్, భద్రాచలం, అదిలాబాదులోనూ సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మెున్నటి వరకు తెలంగాణలో విపరీతమైన ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టగా.. తాజాగా చలికాలం ప్రారంభమైంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఈసారి విభిన్న వాతావరణపరిస్థితులు నెలకొన్నాయి. ఎండకాలం ప్రారంభం మాదిరిగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గత కొద్ది రోజులుగా పగటిపూట ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది ఎండాకాలమా? శీతాకాలమా ? అన్న అనుమానం వచ్చే విధంగా మధ్యాహ్నం సమయంలో 33-36 డిగ్రీ సెంటిగ్రేడ్ల మధ్య ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నవంబర్ 15 వరకు ఎండల తీవ్రత ఉంటుందని ముందుగా ఐఎండీ అంచనా వేసింది. వచ్చే రెండు మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత తీవ్రత..
జిల్లా మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో మరింత చలి తీవ్రత కనిపిస్తోంది. వారం రోజులుగా చలి తీవ్రత విపరీ తంగా పెరిగిపోవడంతో వ్యవసాయ పనులకు ఇబ్బం దికరంగా మారుతోంది. ఉదయాన్నే లేచి పంట చేన్లలోకి వెళ్లే రైతులు 11గంటల వరకు వెళ్లే పరిస్థితులు కనిపిం చడం లేదు. 5గంటల వరకే తిరుగుముఖం పడుతున్నారు. అలాగే పశువులు చలితో గొంగరపోయి వణికి పోతున్నా యి. చలి తీవ్రతతో వ్యవసాయ పనులు ఆశించిన స్థాయి లో ముందుకు సాగడం లేదని రైతులు వాపోతున్నారు. మారుమూల ఏజెన్సీ గ్రామాలపై చలి పంజా విసురు తోంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు వుతున్నాయి.
వారం రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. సాయంత్రం 5గంటలకే చల్లటి ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బం దులకు గురవుతున్నారు. సాయంత్రం వేళల్లో త్వరగానే పనులను ముగించుకొని ఇంటికే పరిమితమవుతున్నారు. ఉదయం 10గంటల వరకు జనం బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రధానంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, పాల వ్యాపారులు, మార్నింగ్‌వాక్ చేస్తున్న వారంత చలి తీవ్రతతో ఇబ్బందులకు గురవు తున్నారు. ఉదయం, సాయంత్రం ఉన్ని దుస్తులు ధరించనిదే బయటకు వెళ్లేందుకు వీలు పడడంలేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రజలు వెచ్చని దుస్తులు ధరించి పనులు చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో చలికాలం ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.