Weather Latest Update: ఏపీ తీరం వెంబడి కొనసాగుతున్న అల్పపీడనం- ఈ ప్రాంతాల్లో వర్షాలు!
పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ ఉంది. తదుపరి 12 గంటలలో ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
నైరుతి దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. 5 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి చెన్నైకి తూర్పున 160 కి.మీ, నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 245 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయ-ఆగ్నేయంగా 360 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ ఉంది. తదుపరి 12 గంటలలో ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
Depression over Southwest Bay of Bengal moved west-northwestwards and lay centered at 1730 hours IST of 21st November 2022 over Southwest and adjoining Westcentral Bay of Bengal, about 190 km east of Chennai and 420 km north-northeast of Jaffna (Sri Lanka). pic.twitter.com/KxK0xbKZmP
— India Meteorological Department (@Indiametdept) November 21, 2022
హెచ్చరికలు:
నవంబర్ 22న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 23న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గాలి హెచ్చరిక:
నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా 45-55 kmph నుండి 65 kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
సముద్ర పరిస్థితి
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక తీరాల వెంబడి సముద్ర పరిస్థితి చాలా ఉధృతంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా మెరుగుపడుతుంది. నవంబర్ 23 ఉదయం నాటికి ఓ మోస్తరుగా మారుతుంది.
Depression over Southwest and adjoining Westcentral Bay of Bengal moved west-northwestwards and lay centred at 2330 hours IST of 21st November over the same region, about 160 km east of Chennai, and 410 km north-northeast of Jaffna (Sri Lanka).
— India Meteorological Department (@Indiametdept) November 21, 2022
మత్స్యకారుల హెచ్చరిక
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్‌లో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా ఉంటే.. కనిష్ట ఉష్ణోగ్రరతలు 19 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉంది. -
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 21, 2022