News
News
X

Bharat Jodo Yatra: కింద పడిపోయిన పాప- ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న సోనియా, రాహుల్!

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. కింద పడిపోయిన ఓ పాపను పైకి లేపి, పలకరిస్తోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
 
త్రBharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర.. కర్ణాటకలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఈ యాత్రలో పాల్గొన్నారు. కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆ సమయంలో జనం ఎక్కువగా ఉండటంతో ఓ చిన్న పాప కింద పడిపోయింది. ఇది గమనించిన సోనియా, రాహుల్ గాంధీ వెంటనే స్పందించి ఆ పాపను పైకి లేపి దగ్గరకు తీసుకున్నారు.

ఇదీ జరిగింది

News Reels

మండ్య జిల్లాలో కవాతులో భారీ రద్దీ కారణంగా ఓ బాలిక కింద పడిపోయింది. ఇది గమనించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే ఆగిపోయారు. ఆ బాలికను పైకి లేపిన సోనియా గాంధీ.. "ఏమైనా దెబ్బ తగిలిందా అంటూ" ఆ పాపను నిమిరారు.

త్రివర్ణ పతాకం పట్టుకున్న ఆ పాపను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకున్నారు. "ఏం పర్లేదు కదా" అని అడిగారు. ఈ వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షూ లేస్

రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ కూడా జోడో యాత్రలో పాలు పంచుకున్నారు.  ఆ సమయంలో ఆమె వేసుకున్న షూ లేస్ ఊడిపోయింది. దీంతో పక్కనే ఉన్న రాహుల్.. అమ్మ సోనియా గాంధీ షూ లేస్ కట్టారు.  సోనియా నవ్వులు చిందిస్తూ తన కుమారుడిని చూశారు. తల్లీ కొడుకుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "కాంగ్రెస్ పార్టీకి యువరాజైనా.. సోనియాకు మాత్రం రాహుల్ కొడుకే" అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ.. పలువురు కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

సత్యం, అహింస మార్గంలో నడవడాన్ని మనకు బాపూజీ నేర్పించారు. ప్రేమ, కరుణ, సద్భావం, మానవత్వం అర్థాలను వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాం. బాపూజీ ఏ విధంగా అయితే అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారో, అదే విధంగా ఇప్పుడు మేం భారత దేశాన్ని ఏకం చేస్తాం.                                                              "

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Also Read: Nobel Prize 2022 Literature: సాహిత్య రంగంలో ఫ్రెంచ్ రచయిత్రిని వరించిన నోబెల్ బహుమతి

Also Read: Mulayam Singh Yadav Health: లైఫ్ సపోర్ట్‌పై ములాయం సింగ్ యాదవ్- తాజా హెల్త్ బులిటెన్ విడుదల!

Published at : 06 Oct 2022 05:23 PM (IST) Tags: Bharat Jodo Yatra We Care Sonia Gandhi Rahul Rescue Young Girl

సంబంధిత కథనాలు

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Election Results 2022 Live: గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన BJP- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ జోష్

Election Results 2022 Live: గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన BJP- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ జోష్

Himachal Pradesh Election Results 2022: బీజేపీ నుంచి మా ఎమ్మెల్యేలకు థ్రెట్ ఉంది, అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతుంది - భూపేష్ బాగేల్

Himachal Pradesh Election Results 2022: బీజేపీ నుంచి మా ఎమ్మెల్యేలకు థ్రెట్ ఉంది, అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతుంది - భూపేష్ బాగేల్

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: మోర్బి నియోజకవర్గంలోనూ బీజేపీదే ఆధిక్యం, ప్రభావం చూపని వంతెన ప్రమాదం

Gujarat Election Results 2022: మోర్బి నియోజకవర్గంలోనూ బీజేపీదే ఆధిక్యం, ప్రభావం చూపని వంతెన ప్రమాదం

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?