Watch Video: క్యాంపెయినింగ్ స్టైల్ మార్చేసిన రాహుల్, డెలివరీ ఏజెంట్‌తో బైక్ రైడ్ - వైరల్ వీడియో
Watch Video: రాహుల్ గాంధీ బెంగళూరులో ప్రచారం చేసే క్రమంలో బైక్‌రైడ్ చేశారు.
Watch Video:
కర్ణాటకలో బైక్ రైడ్
కర్ణాటక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఓ వైపు భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తుంటే..ఇటు కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రచారం చేసే క్రమంలో ఓ డెలివరీ ఏజెంట్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు రాహుల్. కాసేపు అక్కడి వాళ్లతో మాట్లాడి వెంటనే హెల్మెట్ పెట్టుకుని ఆ డెలివరీ ఏజెంట్ స్కూటీ ఎక్కారు. ఇది చూసి షాక్ అయిన ఆ వ్యక్తి రాహుల్‌ని చూసి నవ్వాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి కొంత దూరం వరకూ ప్రయాణించాడు. అలా వెనకాలే కూర్చుని కాసేపు రైడ్ చేశారు రాహుల్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటికప్పుడు హెల్మెట్ పెట్టుకుని బైక్ ఎక్కడాన్ని చూసి చుట్టూ ఉన్న సెక్యూరిటీ కూడా షాక్ అయింది. వెంటనే అలెర్ట్ అయ్యి బైక్‌ను వెంబడించారు బాడీగార్డ్‌లు. కొంత దూరం వరకూ అలానే పరిగెత్తారు. అయితే...కాసేపే అలా రైడ్ చేస్తారనుకుంటే...ఏకంగా 2 కిలోమీటర్ల వరకూ అలానే ప్రయాణించారు రాహుల్. ఆయన ఉండే హోటల్ వరకూ అలా బైక్‌పైనే వెళ్లారు. సాధారణంగా రాహుల్ ప్రచారం గతంలో సాదాసీదాగా సాగేది. కానీ భారత్ జోడో యాత్ర తరవాత ఆయన క్యాంపెయినింగ్ స్టైల్‌లో మార్పు కనిపిస్తోంది. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో చాలానే మారారు. అందుకు ఈ స్కూటర్ రైడే ఉదాహరణ.
One of the sweetest gesture of Rahul Gandhi ❤️
— Rohini Anand💕 (@miss_roh08) May 7, 2023
He met a young lad and interacted him and rode on a bike with Blink it delivery person ☺️
Rahul Gandhi is seriously very down to earth ☺️
God bless this man a lot!! ✨ pic.twitter.com/T6rEo2JEHO
ఇటీవలే రాహుల్ గాంధీ ఓల్డ్ ఢిల్లీలోని మతియా మహల్ మార్కెట్, బెంగాలి మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ చాలా సేపు షాపింగ్ చేశారు. అక్కడి ఫేమస్ వంటకాలన్నీ రుచి చూశారు. స్థానికంగా అందరూ ఎంతో ఇష్టపడే షర్బత్ తాగారు. పండ్లు తిన్నారు. ఆ తరవాత పానీపూరి కూడా టేస్ట్ చేశారు. అక్కడే కాదు. ఢిల్లీలోని ఫేమస్ ఫుడ్ పాయింట్లకు వెళ్లి సందడి చేశారు. రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అనర్హతా వేటు పడిన తరవాత ఆ బంగ్లా వదిలి వెళ్లిపోవాలని నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. తల్లి సోనియా గాంధీ ఇంటికి మకాం మార్చారు.
मोहब्बत की शरबत ❤️ pic.twitter.com/3qLQAaf6oF
— Congress (@INCIndia) April 18, 2023
Also Read: రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా పవర్ కట్, చీకట్లోనే ప్రసంగించిన ద్రౌపది ముర్ము