Twin Tower Demolition Video: నోయిడా ట్విన్ టవర్స్ నేలమట్టం, సరిగ్గా 9 సెకన్లలో పూర్తైన బ్లాస్ట్
Noida Twin Towers Demolished: నోయిడాలోని ట్విన్ టవర్స్ నేలమట్టమయ్యాయి.
Noida Twin Towers Demolished:
నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తైంది. అనుకున్న విధంగానే సరిగ్గా 9 సెకన్లలో ఈ టవర్లు నేలమట్టమయ్యాయి. పక్కనే ఉన్న బిల్డింగ్‌లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిపై దుమ్ము, ధూళి పడకుండా పూర్తిగా క్లాత్‌లతో కప్పేశారు. ఈ రెండు టవర్స్‌ని కూల్చేందుకు మొత్తం 3,700 కిలోల బరువైన ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగించారు. ఈ టవర్స్‌లోని 7000 హోల్స్‌లో ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అమర్చారు. 20 వేల సర్క్యూట్‌లు ఏర్పాటు చేశారు. ట్రిగ్గర్ చేసినప్పుడు ఉన్నట్టుండి ఆ పిల్లర్స్ నిలువునా కూలిపోతాయి. దీన్నే "వాటర్ ఫాల్ టెక్నిక్" (Waterfall technique) అంటారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ కూల్చివేత 9 సెకన్లలో పూర్తైంది. ఇది కూలిపోయిన తరవాత వచ్చే దుమ్ము అంతా తేలిపోవటానికి కనీసం 12 నిముషాలు పడుతుంది. ఒకవేళ గాలి బాగా వీస్తే ఇంకా ఎక్కువ సమయమే పడుతుండొచ్చని అధికారులు వివరించారు. దాదాపు 55 వేల టన్నుల మేర శిథిలాలు పోగవుతాయని అంచనా. వీటిని క్లియర్ చేయటానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ శిథిలాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే డంప్ చేయనున్నారు.
ఈ టవర్స్‌కు 8 మీటర్ల దూరంలోనే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. వాటితో పాటు 12 మీటర్ల రేడియస్‌లో మరికొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ ప్రత్యేక క్లాత్‌తో కవర్ చేశారు. ట్విన్ టవర్స్ కూల్చినప్పుడు వచ్చే దుమ్ము ఆ భవంతులపై పడకుండా ఇలా కవర్ చేయనున్నారు. రూ.100కోట్ల ఇన్సూరెన్స్ పాలసీతో ఈ ఎక్స్‌ప్లోజన్ చేపట్టారు పరిసర ప్రాంతాల్లోని బిల్డింగ్‌లకు ఏమైనా డ్యామేజ్ జరిగితే ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ప్రీమియంతో పాటు ఇతర ఖర్చులన్నీ సూపర్‌టెక్ కంపెనీయే భరించాల్సి ఉంటుంది. ఈ డిమాలిషన్ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.20 కోట్లు ఖర్చు కానుంది. మొత్తం నష్టం రూ.50 కోట్లు అని అంచనా. ముంబయికి చెందిన Edifice Engineering సంస్థ ఈ కూల్చివేతను చేపట్టనుంది. దాదాపు 9 ఏళ్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్న తరవాత..చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ ఆవరణలో ఈ టవర్స్‌ను అక్రమంగా నిర్మించారన్న కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా వీటిని కూల్చివేశారు. ఇందుకోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నోయిడా అథారిటీస్ ఈ బ్లాస్ట్‌ను పర్యవేక్షించాయి. సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ వాసులు 2012లో కోర్టుకు వెళ్లారు. అంతకు ముందు గార్డెన్ అని చెప్పిన ప్లేస్‌లోనూ బిల్డింగ్‌లు కట్టేందుకు ప్లాన్‌ను రివైజ్ చేయటంపై వాళ్లు కోర్టుని ఆశ్రయించారు. వీటికి అక్రమంగా అనుమతులు వచ్చాయని గుర్తించిన అధికారులు..కొందరిపై చర్యలు తీసుకున్నారు. అలహాబాద్ హైకోర్ట్ 2014లోనే ఈ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పునిచ్చింది. ఆ తరవాతే ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. మొత్తానికి ఇలా కూలిపోయింది.
#WATCH | Once taller than Qutub Minar, Noida Supertech twin towers, reduced to rubble pic.twitter.com/vlTgt4D4a3
— ANI (@ANI) August 28, 2022
— ANI (@ANI) August 28, 2022