Watch Video: బాబు మీకింకా బుద్ధి రాలేదా, కేబుల్ బ్రిడ్జ్‌పై కార్ నడుపుతారా - వైరల్ వీడియో
Watch Video: కర్ణాటకలోని ఓ కేబుల్ బ్రిడ్జ్‌పై కార్ నడిపిన వీడియో వైరల్ అవుతోంది.
Watch Video:
గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో చూశాం. కేవలం బ్రిడ్జ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే వందలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే దీనిపై విచారణ వేగంగా సాగుతోంది. ఈ వంతెన కూలిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆగ్రహానికి గురి చేస్తోంది. నార్త్ కర్ణాటకలో ఓ తీగల వంతెనపై
కార్ నడుపుతున్న వీడియో ఇది. ఓ డ్రైవర్ తన కారుని వంతెనపైకి తీసుకొచ్చి రివర్స్ గేర్‌లో మళ్లీ వెనక్కి తీసుకెళ్తుండగా స్థానికులు వీడియో తీశారు. చుట్టు పక్కల ఉన్న వాళ్లు గట్టిగా అరుస్తున్నారు. అయినా ఆ డ్రైవర్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రమాదకరమైన సాహసం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్‌పై మండి పడుతున్నారు. మోర్బి ఘటన చూశాక కూడా బుద్ధి రాలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
No lessons learnt post #MorbiBridgeCollapse . Hooligans/tourists from Maharashtra were seen driving a car on a suspension bridge at Yellapura town in Uttara Kannada district of Karnataka. Finally the locals ensured that the car was driven back from the bridge in reverse gear. pic.twitter.com/RvVPOhB8CL
— Harish Upadhya (@harishupadhya) November 1, 2022
మోర్బి ఘటన సంచలనం..
మోర్బి వంతెన కూలిన ఘటనకు బాధ్యులైన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సంస్థ మేనేజర్, తదితర సిబ్బందిని విచారిస్తున్నారు. లోకల్ కోర్ట్‌లో విచారణ కొనసాగుతుండగా...డిప్యుటీ ఎస్పీ కోర్టుకు ఓ కీలక విషయం వెల్లడించారు. వంతెన వైర్లు తుప్పుపట్టి పోయాయని, వాటిని రిపేర్ చేయించి ఉంటే ప్రమాదం జరిగుండేదే కాదని వివరించారు. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న మేనేజర్ దీపక్ పరేఖ్‌తో సహా 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ మేనేజర్‌ను విచారిస్తున్న సమయంలో కోర్టులో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తోంది. "ఇలాంటి దుర్ఘటన జరగాలని దేవుడే కోరుకున్నాడేమో" అని ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. వైర్లకు తుప్పు పట్టిందని, వాటికి కనీసం ఆయిల్ కూడా రాయలేదని డిప్యుటీ ఎస్పీ స్పష్టం చేశారు.
Also Read: Elon Musk: బ్లూటిక్ ఉంటే నగదు కట్టాల్సిందే - ఫిక్స్ చేసిన ఎలాన్ మస్క్!