అన్వేషించండి

Polamaba Jathara 2023: ఈనెల 23న గిరిజనుల ఆరాధ్య దైవం పోలమాంబ జాతర, 24న సిరిమానోత్సవం!

Polamaba Jathara 2023: ఈనెల 23వ తేదీన గిరిజనుల ఆరాధ్య దైవం పోలమాంబ జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే 24న సిరిమానోత్సం నిర్వహించనున్నారు. 

Polamaba Jathara 2023: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగ తర్వాత పెద్ద సిరిమానోత్సవం శంబర పోలమాంబదే. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ నెల 23న తొలేళ్లు, 24న సిరిమానోత్సవం, 25న అంపకోత్సవం జరగనుంది. కరోనా నేపథ్యంలో గత మూడేళ్లు ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గింది. ఈసారి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో లక్షల్లో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి రెండు లక్షల మంది వచ్చినా.. వారికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో వి.రాధాకృష్ణ తెలిపారు. 

భక్తులకు ఇబ్బందులు లేకుండా మూడు క్యూ లైన్లు..

ఉచిత దర్శనంతో పాటు రూ.10, రూ.50 దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. పులిహోర ప్రసాదం ధర రూ.10, లడ్డూ రూ.15 గా నిర్ణయించారు. విశ్రాంతి భవనాలు, కేశ ఖండన శాల, చెప్పుల స్టాండ్‌, శాశ్వత క్యూలైన్లు లేకపోవడం కొంత ఇబ్బందే.  వీటి గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. 

సిరిమాను తిరిగేందుకు...

ఉత్సవంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం ఈ నెల 24న జరగనుంది. లక్షల్లో భక్తులొస్తారని అంచనా.. ప్రస్తుతం సిరిమాను తిరిగేందుకు వీలుగా ఆ మార్గాన్ని బాగు చేస్తున్నారు. గుంతలను పూడ్చుతున్నారు. గొల్లవీధి నుంచి పెద్దవలస వెళ్లే మార్గంలో 90 మీటర్ల సీసీ రోడ్డు పనులు సాగుతున్నాయి. సిరిమాను గుర్తింపు, తయారీ, ఊరేగింపునకు గతంలో వీధుల వారీగా బృందాలు ఉండేవి. ఆలయ అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల సమస్యలు ఎదురయ్యేవి. ఈసారి అలా జరగకుండా ధర్మకర్తల పర్యవేక్షణలో ఒకరికే బాధ్యతలు అప్పగించేలా ప్రణాళికలు వేస్తున్నారు. 

వనంగుడి, చదురుగుడి ఆలయాల వద్ద ఎండ నుంచి ఉపశమనం పొందేలా చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. చిన్నారులకు పాలు, సాధారణ భక్తులకు మంచినీరు అందుబాటులో ఉంచుతున్నారు. గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో వీరు మొదటి వారంలో రాకుండా ఉంటే మంచిదని ఆలయ అధికారులు కోరుతున్నారు. భక్తులకు సేవలు అందించేందుకు వివిధ ఆలయాల నుంచి డిప్యుటేషన్‌పై 95 మంది సిబ్బందిని నియమించారు. పలు స్వచ్ఛంద సంస్థలూ పాల్గొననున్నాయి.

అమ్మవారి ఘటాల ఊరేగింపు..

శంబర జాతర నేపథ్యంలో పోలమాంబ అమ్మవారి ఘటాల ఊరేగింపు వేడుకగా జరిగింది. చదురు గుడిలో ఉంచిన ఘటాలకు గురువారం వేకువజాము నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. దారి పొడవునా భక్తులు మొక్కులు చెల్లించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు పరిశీలించారు. శంబర గ్రామానికి చేరుకుని వనంగుడి, చదురు గుడి ఆలయ ప్రాంగణాలను తనిఖీ చేశారు. కూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, సిరిమాను ఉంచే ప్రదేశాలను చూశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget