By: ABP Desam | Updated at : 01 Mar 2023 02:46 PM (IST)
Edited By: jyothi
గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌లో పెన్నుతోపాటు అన్నీ స్పెషలే- ఏపీ కళానైపుణ్యం చాటేలా ప్రత్యేక ఏర్పాట్లు
Global Investors Summit: పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా వచ్చిన అతిథిలకు ఇక్కడ సంప్రదాయాలను కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేలా ప్లాన్ వేశారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్న వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించింది. దేశంలోని వివిధ నగరాల్లో రోడ్‌షోలను కూడా నిర్వహించింది. మఖ్యంగా పదిహేను రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా విధవిధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం. సమ్మిట్‌లో చర్చలు కూడా ఆ దిశగానే చేపట్టేలా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.
పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు రాష్ట్ర సంప్రదాయాలు, కళానైపుణ్యాలను కూడా వచ్చిన అతిథులకు వివరించేలా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేపట్ట నుంది ప్రభఉత్వం. హస్తకళలు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేసేలా ఈ సమ్మిట్‌లో డిస్కషన్స్, డిబెట్స్‌తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ప్రణాళిక వేశారు.
ఈ సదస్సుకు వచ్చే అతిథులు, ఇతరులకు ఏపీ హస్తకళాకారులు రూపొందించిన గుర్తింపు కార్డులను ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న కళానైపుణ్యం అతిథులకు తెలిసేలా వాటిని తయారు చేస్తున్నారట. దీనిపై సీఎం ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించి ప్రత్యేక సూచనలు చేశారు. తోలుబొమ్మల తయారీలో వాడే మెటీరియల్‌తో బ్యాడ్జీలు చేసి వాటి వెనక కలంకారీ డిజైన్లు ముద్రించమన్నారు. సమ్మిట్‌లో పాల్గొనే వారికి ఇచ్చే నోట్ బుక్స్ పై కూడా కలంకారీ డిజైన్ ప్రింట్ వేయించారు. పెన్నులపై రాష్ట్ర పక్షి చిలుక లోగోతోపాటు అడ్వాంటేజ్ ఏపీ అని గుర్తును ముద్రిస్తున్నారు. ముఖ్య అతిథులకు సిల్వర్ పిలిగ్రీతో చేసిన రాష్ట్ర జీఐఎస్ లోగో బహూకరించనున్నారు.
ఐడీ కార్డులు, అతిథులకు ఇచ్చే గిఫ్టు బాక్సులను కూడా ప్రత్యేకంగా తయారు చేయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో సిరామిక్ ప్లేటు, పెన్ను, అరకు కాఫీ, ఉడ్ కోస్టర్స్‌తో కూడిన బాక్సులను ఉంచుతుతోంది. దీన్నే వచ్చిన గెస్ట్‌లకు బహుమతిగా ఇవ్వనుంది. ఈ సిరామిక్ ప్లేట్లను కలంకారీ డిజైన్‌తో అందంగా తీర్చిదిద్దారు. వాటి వెనక రాష్ట్ర చిహ్నంతోపాటు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జీఐఎస్ లోగోను ముద్రించారు. ఈ సదస్సులో వన్ డిస్ట్రికస్, వన్ ప్రొడెక్ట్ కింద రాష్ట్రంలోని హస్త కళలు, వివిధ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేలా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటు జరగనుంది. ఈ రెండు రోజులు రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్యాలు, కళలు ప్రదర్శించనున్నారు. కూచిపూడి నృత్యం, జానపద కళలతో ఈ ప్రదర్శనలు ఉండనున్నాయి. ప్రముఖ నర్తకి యామిని రెడ్డి కూచిపూడి నృత్యం చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ తుషార్ కలియాతో ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించనున్నారు. వీటితోపాటు థింసా, తప్పెట గుళ్లు, గరగలు, ఉరుములు, కొమ్ము నృత్యం తదితర ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశారు. రెండో రోజు ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న పథకాలను అందరికీ అర్థమయ్యేలా కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. అలా ఈ సమ్మిట్ ను పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సంస్కృతి, సాంప్రదాయాల ప్రచారానికి వేదికగా మల్చనున్నారు.
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Ysrcp Meeting : రేపే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం, 45 మందిపై సీఎం అసంతృప్తి!
Heat Wave in India: ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, ఆ పది రాష్ట్రాలకు గండం - హెచ్చరించిన IMD
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?
SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్ 204
Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్
Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్