News
News
X

Viral Video: వీడెవడండి బాబు, హైటెన్షన్ వైర్లపై సర్కస్ ఫీట్లు - చూసిన వారికి ముచ్చెమటలు

Viral Video: యూపీలోని ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్లపై ఫీట్లు చేశాడు.

FOLLOW US: 
 
Viral Video: 

యూపీలో ఘటన..

రిస్క్‌ చేసైనా సరే కొందరు ఫేమస్ అయిపోవాలనుకుంటారు. ఈ సోషల్ మీడియా పాపులర్ అయ్యాక...ఇలాంటి ఫీట్లు బాగా పెరిగిపోయాయి. కొందరు సెల్పీలు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటే...ఇంకొందరు రెప్పపాటులో మృత్యువు నుంచి బయట పడుతున్నారు. రోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే...కొందరు నిరసన వ్యక్తం చేసేందుకు ఇలాంటి రిస్కీ మార్గాలు ఎంచుకుంటారు. సెల్ టవర్లు ఎక్కడం, వాటర్ ట్యాంక్‌లు ఎక్కి గోల చేయటం..కామన్. కానీ...యూపీలోని ఓ వ్యక్తి ఏకంగా హైటెన్షన్ వైర్లతోనే సాహసాలు చేశాడు. అది చూస్తూ చుట్టు పక్కల వాళ్లు టెన్షన్ పడిపోయారు. అసలు వివరాల్లోకి వెళ్తే...యూపీలోని పిలిబిత్ ఏరియాలో అమారియా టౌన్‌లో నివసించే నౌషద్ అనే వ్యక్తి ఈ సాహసం చేశాడు. ఈ నెల 24వ తేదీన ఆ వ్యక్తి ఉన్నట్టుండి పైకి ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకుని అటు ఇటూ వేలాడుతూ చుట్టు పక్కల వారిని భయానికి గురి చేశాడు. మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే ఇలా చేశాడా వ్యక్తి. ఇదంతా స్థానికులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది...క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఆ వ్యక్తి వైర్లపై ఫీట్లు చేసినంత సేపు అందరూ అలాగే భయంభయంగా చూస్తూ ఉండిపోయారు. 

కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది..

మనోడి లక్కు బాగుంది. ఎందుకంటే...అక్కడ భారీ వర్షాల కారణంగా కరెంట్ పోయింది. అందుకే...అలాంటి ఫీట్‌లు చేసినా ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఈ ఫీట్లు చేయడాన్ని చూసిన స్థానికులు వెంటనే కరెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు కాల్ చేశారు. తాము చెప్పేంత వరకూ కరెంట్‌ ఇవ్వొద్దని చెప్పారు. వెంటనే కొందరు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని వారించి కిందకు దింపారు. నౌషద్...ఓ బండిపై గాజులు విక్రయిస్తుంటాడు. కుటుంబ సభ్యులు వచ్చి అధికారులతో మాట్లాడారు. ఎందుకిలా చేశాడనటానికి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే...కుటుంబ సభ్యులు మాత్రం అప్పుడప్పుడు ఇలానే ప్రవర్తిస్తుంటాడని చెప్పారు. మొత్తానికి కాసేపటి వరకూ అందరినీ టెన్షన్ పెట్టాడీ వ్యక్తి. 

Also Read: Uttar Pradesh News: కడుపు నొప్పితో వచ్చిన వ్యక్తికి ఆపరేషన్, ఆ పొట్టలో ఏమున్నాయో చూసి షాకైన వైద్యులు

Also Read: China Restaurant Fire: రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు- ప్రమాదంలో 17 మంది మృతి!

Published at : 28 Sep 2022 05:02 PM (IST) Tags: uttar pradesh Viral video Viral News Man's Stunt On High Tension Wires High Tension Wires Power Line

సంబంధిత కథనాలు

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

TS Inter Fees: ఇంట‌ర్ విద్యార్థులకు అలర్ట్, ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?

TS Inter Fees:  ఇంట‌ర్ విద్యార్థులకు అలర్ట్, ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

Minister KTR : తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

Minister KTR :  తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు