Viral Video: వీడెవడండి బాబు, టవల్ కట్టుకుని మెట్రో ఎక్కేశాడు - వైరల్ వీడియో
Viral Video: ఓ యువకుడు టవల్ కట్టుకుని మెట్రో ఎక్కి తిరుగుతూ ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
ఇంట్లో నీళ్లు లేవట..
సోషల్ మీడియాలో ఎప్పుడే వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. కొందరు ఈ వీడియోల ద్వారానే ఫేమస్ అయిపోతుంటారు. కొందరు కావాలనే ప్రాంక్‌లు చేసి వీడియోలు వైరల్ చేస్తుంటారు. అయితే..ఇది ప్రాంకో కాదో తెలియదు కానీ...సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి టవల్ కట్టుకుని ఢిల్లీ మెట్రో ఎక్కాడు. అలాగే కంపార్ట్‌మెంట్‌లు అన్నీ తిరిగాడు. ప్యాసింజర్స్ అతడిని చూసి ఆశ్చర్య పోయారు. కొందరు నవ్వుకున్నారు. మరి కొందరు "ఇదేం చోద్యం" అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. కానీ...ఆ యువకుడు మాత్రం అదేదీ పట్టించుకోకుండా టవల్ కట్టుకుని అటు ఇటు తిరిగాడు. మోహిత్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పటికే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. క్యాజువల్‌గా అలా టవల్ చుట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు యువకుడు. అంతే కాదు. అలాగే నించుని ఫోన్ కూడా మాట్లాడాడు. అంతే కాదు. మెట్రో విండోలోని మిర్రర్‌లోకి చూస్తూ క్రాఫ్ సరి చేసుకుంటూ చాలా హడావుడి చేశాడు. అసలు చుట్టు పక్కల వాళ్లు ఏమనుకుంటారన్న సంగతే మర్చిపోయాడు. కొంతమంది ఆ యువకుడిని చూసి తెగ నవ్వుకున్నారు. "ఇంట్లో ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయి. ఇవాళ ఆఫీస్‌కి వెళ్లి స్నానం చేస్తాను" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తు న్నారు. "ఇలాంటివి చేయాలంటే గట్స్ ఉండాలి. నీకు సెల్యూట్ బ్రదర్" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "ఇతరుల పెదాలపై చిరునవ్వు తెప్పించిన వాడికన్నా గొప్ప మనిషి ఇంకెవరూ ఉండరు" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
View this post on Instagram
Also Read: Viral Video: బుర్కా వేసుకుని కాలేజ్‌లో స్టెప్పులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం - వైరల్ వీడియో