Viral video: ఆనియన్ రింగ్స్ అంటే ఇవా, అరెరే మేం ఇంకేదో అనుకున్నామే
దిల్లీలో ఓ ఫుడ్ డెలివరీ యాప్ చేసిన పనికి కంగు తిన్న వినియోగదారుడు.
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే..
ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక ఇంట్లో స్నాక్స్ చేసుకోవాల్సిన శ్రమ తగ్గిపోయింది. జస్ట్ వన్ ట్యాప్‌తో నచ్చిన ఫుడ్ నిముషాల్లో ఇంటికి వచ్చేస్తోంది. ఆయా కంపెనీలు కూడా ఆఫర్లు, డిస్కౌంట్‌లు అంటూ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నాయి. కొన్ని సంస్థలు నాణ్యమైన ఆహారాన్నే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరోటి రావటం కామన్ అయిపోయింది. ఈ కామర్స్ యాప్స్ కూడా ఇంతే. ఆ మధ్య ఓ వ్యక్తి ఐఫోన్ ఆర్డర్ చేస్తే డిటర్జెంట్ సబ్బుని పంపింది సంస్థ. ఐఫోన్ వచ్చేసిందని చాలా ఎగ్జైటింగ్‌గా బాక్స్ తెరచి చూసిన ఆ వ్యక్తి సబ్బు చూసి కంగుతిన్నాడు. ఇలాంటి అనుభవాలు ఎదురైన వాళ్లు తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు. ఇప్పుడు ఓ ఫుడ్ డెలివరీ యాప్ చేసిన పనిని ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు ఓ నెటిజన్. అది చూసిన వాళ్లంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
రింగ్ ఆనియన్స్ తెచ్చిన తంటా
దిల్లీలోని ఓ వ్యక్తి సాయంకాలం స్నాక్స్ కోసం ఆనియన్ రింగ్స్‌ని ఆర్డర్ చేశాడు. ట్రింగ్ ట్రింగ్‌మని బెల్ మోగితే వెళ్లి పార్సిల్ తీసుకున్నాడు.
తీరా వచ్చి చూస్తే పచ్చి ఉల్లిగడ్డలే రింగ్‌ల రూపంలో కట్ చేసి ఉన్నాయి. అది చూసి "రింగ్ ఆనియన్స్" అంటే వీళ్లకు ఇలా అర్థమైందా అనుకుని నవ్వుకున్నాడు. ఈ తతంగాన్నంతా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్ చేశాడు. సిచ్యుయేషన్‌కి సరిపడే ఓ పాటను దానికి జోడించి స్టోరీ పెట్టాడు. ఇంకేముంది అది చూసిన వాళ్లు రకరకాల రియాక్షన్లు ఇచ్చారు. దిసీస్ ఫన్నీ, ఇది నిజమేనా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫన్నీ ఘటనపై తనకు తానే మీమ్స్ తయారు చేసి వాటినీ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడా వ్యక్తి. వీటికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
View this post on Instagram