News
News
వీడియోలు ఆటలు
X

Viral Video: మెట్రోలో పళ్లు తోముకున్న యువకుడు, పాపం ఇంట్లో కుదరలేదేమో - వైరల్ వీడియో

Viral Video: ఓ యువకుడు ఢిల్లీ మెట్రోలో బ్రష్ చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

Delhi Metro Viral Video: 

మెట్రోలోనే బ్రషింగ్ 

ఢిల్లీ మెట్రో వైరల్ వీడియోలతోనే బాగా పాపులర్ అయిపోయింది. ఎవరో ఒకరు మెట్రోలో వింతగా ప్రవర్తించడం దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం..అది వైరల్ అవడం. ఇదంతా చాలా రోజులుగా జరుగుతున్నదే. ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు మెట్రో ఎక్కాడు. ఉన్నట్టుండి జేబులో నుంచి బ్రష్ తీసి అక్కడే తోముకోవడం మొదలు పెట్టాడు. ఇది చూసి చుట్టూ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. "వీడేంటి ఇలా చేస్తున్నాడు" అన్నట్టుగా వింతగా చూశారు. ఓ అమ్మాయైతే ఫోన్ మాట్లాడటం ఆపేసి మరీ ఆ యువకుడిని అలాగే చూస్తూ కూర్చుంది. ఫస్ట్ షాక్ అయిన ఆ యువతి..తరవాత నవ్వుకుంది. ఆ యువకుడు అలా బ్రష్ చేసుకుంటూ ఒక్కచోటే ఆగిపోలేదు. మెట్రోలని బోగీలన్నీ చుట్టొచ్చాడు. అలా బ్రష్ చేసుకుంటూనే నడుచుకుంటూ దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. ప్రతి బోగిలోనూ అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోయారు. 

View this post on Instagram
 
A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar)

గతంలోనూ ఓ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో ఎప్పుడే వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. కొందరు ఈ వీడియోల ద్వారానే ఫేమస్ అయిపోతుంటారు. కొందరు కావాలనే ప్రాంక్‌లు చేసి వీడియోలు వైరల్ చేస్తుంటారు. అయితే..ఇది ప్రాంకో కాదో తెలియదు కానీ...సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఏ యువకుడైతే మెట్రోలో బ్రష్ చేసుకుంటూ షాక్ ఇచ్చాడో..అదే గతంలో ఓ సారి వ్యక్తి టవల్ కట్టుకుని ఢిల్లీ మెట్రో ఎక్కాడు. అలాగే కంపార్ట్‌మెంట్‌లు అన్నీ తిరిగాడు. ప్యాసింజర్స్‌ అతడిని చూసి ఆశ్చర్య పోయారు. కొందరు నవ్వుకున్నారు. మరి కొందరు "ఇదేం చోద్యం" అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. కానీ...ఆ యువకుడు మాత్రం అదేదీ పట్టించుకోకుండా టవల్ కట్టుకుని అటు ఇటు తిరిగాడు. మోహిత్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పటికే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. క్యాజువల్‌గా అలా టవల్ చుట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు యువకుడు. అంతే కాదు. అలాగే నించుని ఫోన్ కూడా మాట్లాడాడు. అంతే కాదు. మెట్రో విండోలోని మిర్రర్‌లోకి చూస్తూ క్రాఫ్ సరి చేసుకుంటూ చాలా హడావుడి చేశాడు. అసలు చుట్టు పక్కల వాళ్లు ఏమనుకుంటారన్న సంగతే మర్చిపోయాడు. కొంతమంది ఆ యువకుడిని చూసి తెగ నవ్వుకున్నారు. "ఇంట్లో ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయి. ఇవాళ ఆఫీస్‌కి వెళ్లి స్నానం చేస్తాను" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇలా ఈ యువకుడు ఫన్నీ వీడియోలు చేస్తూ పాపులర్ అయిపోతున్నాడు. 

Also Read: Opposition Unity: మాకు ఎలాంటి ఇగోలు లేవు,బీజేపీని జీరో చేయడమే లక్ష్యం - మమతా బెనర్జీ

Published at : 24 Apr 2023 04:47 PM (IST) Tags: Delhi Metro Delhi Metro Video Viral Video Brushing in Metro

సంబంధిత కథనాలు

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 8 June 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

టాప్ స్టోరీస్

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!