News
News
X

Viral Video: ఇది సినిమా షూటింగ్ కాదు, ప్రీ వెడ్డింగ్ షూట్ - ఈ జంట రేంజే వేరు

Viral Video: ఓ జంట బైక్‌పై స్టంట్‌లు చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Pre-Wedding Photoshoot:

బైక్‌పై స్టంట్‌ చేస్తూ..

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. ప్యాకేజ్‌ల లెక్కన భారీ మొత్తంలో వసూలు చేస్తూ అందమైన ఫోటోలను తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. ఆనందమైన క్షణాల్ని ఫోటోల్లో దాచుకోవాలనుకునే వారంతా ఈ ప్యాకేజ్‌లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా సరే...ఫోటోలు, వీడియోలు చాలా రిచ్‌గా రావాలని కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఫోటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. అలాంటి ఫోటో షూట్‌లు వైరల్ అవుతూనే ఉంటాయి. సంగీత్, హల్దీ ఈవెంట్స్‌ను కూడా గ్రాండ్‌గా చేస్తున్నారు. అయితే...ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్  షూట్‌ని గ్రాండ్‌గానే కాకుండా సినిమా రేంజ్‌లో చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల వ్యూస్‌, వేల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే...ఓ జంట బైక్‌పై కూర్చుంది. ఫోటో షూట్‌ కోసం అరేంజ్ చేసుకున్నారులే అనుకుంటాం. కానీ..అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు ఫోటోగ్రాఫర్. ఓ క్రేన్‌తో ఆ బైక్‌ను గాల్లోకి లేపాడు. అలాగే ముందుకు లాక్కెళ్లాడు. ముందు నుంచి ఫోటోలు, వీడియోలు తీశారు. చూడటానికి ఇదేదో యాక్షన్ మూవీ స్టంట్‌లా ఉంది. కేవలం 13 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. పెళ్లి కొడుకు స్టంట్ డైరెక్టర్ అనుకుంటా అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 

గతంలోనూ వైరల్ వెడ్డింగ్ షూట్‌లు..

గతంలో ఎన్నో సార్లు వెరైటీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లు చూశాం. ఓ జంట పొలం పనులు చేస్తూ ఫోటోలు దిగితే..మరో జంట కేవలం దుప్పట్లు కప్పుకుని ఫోటోలు దిగి అప్పట్లో పెద్ద హడావుడే చేసింది సోషల్ మీడియాలో. ఆ తరవాత ఎన్నో జంటలు ఆ ట్రెండ్‌ను కొనసా గించాయి. కొందరు వృద్ధులు కూడా...ఈ మురిపెం తీర్చుకున్నారు. ఆ మధ్య రళలో ఓ ఫోటోషూట్‌ వైరల్ అయింది. ఓ పెళ్లికూతురు ఫోటోలు దిగాలని అనుకుంది. సాధారణంగా అందమైన లొకేషన్స్‌లో షూట్ చేస్తే బాగుంటుందని అనుకుంటారు అమ్మాయిలు. కానీ...ఈ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించింది. తన ఏరియాలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలియాలని అనుకుంది. ఇంకేముంది ఫోటోగ్రాఫర్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చి ఆ గుంతలు పడ్డ రోడ్‌పైనే ఫోటోలు దిగింది. వీడియోలు కూడా తీయించుకుంది. ఈ వీడియో వైరల్ అయింది. ఎర్ర చీర కట్టుకున్న వధువు గుంతలు పడ్డ రోడ్డుపైన నడుచుకుంటూ వస్తుంటే...ఫోటోగ్రాఫర్ ఆ స్టిల్స్ తీశాడు. వెనకాల ఎంతో మంది వాహనదారులు ఆ రోడ్‌లో వెళ్లేందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ వీడియో చాలా క్లియర్‌గా కనిపించింది. ఎక్కడ పడిపోతామో అని చాలా జాగ్రత్తగా బండ్లు నడుపుతున్నారంతా. ఇన్‌స్టాగ్రామ్‌లో Arrow_weddingcompany పేజ్‌లో ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. మిలియన్‌ కొద్ది వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్‌లు పెడుతున్నారు. కేరళ హైకోర్టు NHAIకి ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా రోడ్‌ను మరమ్మతు చేయాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే...ఈ అమ్మాయి ఇలా అక్కడ ఫోటోలు దిగటం వైరల్ అయింది. 

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by arrow_weddingcompany™ (@arrow_weddingcompany)

Also Read: Joy Workout: మీ మూడ్ మార్చి హ్యాపీగా ఉంచే జాయ్ వర్కౌట్ - ఎలా చెయ్యాలో చూసెయ్యండి మరి

Published at : 28 Oct 2022 12:42 PM (IST) Tags: Pre Wedding Shoot Viral Video Funny Wedding Shoot Wedding Shoot on Bike

సంబంధిత కథనాలు

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

China Zero-Covid: పలుకే బంగారమాయెనా? మీడియా ప్రశ్నకు సైలెంట్ అయిన చైనా విదేశాంగ ప్రతినిధి

China Zero-Covid: పలుకే బంగారమాయెనా? మీడియా ప్రశ్నకు సైలెంట్ అయిన చైనా విదేశాంగ ప్రతినిధి

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'