అన్వేషించండి

Viral News : రీల్స్‌ చేసే వరడు కావలెను-సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ వినూత్నపెళ్లి ప్రకటన

Viral News: వరుడి కోసం వినూత్న ప్రకటన ఇచ్చింది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. జీవిత భాగస్వామి మాత్రమే కాదు.. రీల్‌ భాగస్వామి అయ్యే వరుడు కావాలట. ఇదేం వింత రూలో మరి. ఆ కథేంటో తెలుసుకుందామా.

Viral News : కాలం మారుతోంది. సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. ప్రపంచం చేతుల్లోకి వచ్చేసినట్టే. సోషల్‌  మీడియా పుణ్యమా అని... ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఇందులో రీల్స్‌ది కూడా ప్రధాన భూమికే. వైరటీ వైరటీగా రీల్స్‌ చేయడం.. సోషల్‌  మీడియాలో పోస్ట్‌ చేయడం.. ఇదో ట్రెండ్‌. ఆ రీల్స్‌కు వచ్చే లైకులు... పెరిగే ఫాలోవర్లు.. వారికి మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. దీంతో సోషల్‌ మీడియా  ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. 

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం.. కొత్త కొత్త రీల్స్‌లో ఫాలోవర్లను పెంచుకోవడమే కాదు.. ఉన్నవాళ్లను నిలుపుకోవడం కాస్త కష్టమే. దీంతో... రీల్సే  జీవితంగా బతికేస్తున్నారు చాలా మంది. ఈ పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే... సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న ఓ యువతి... తనకు కాబోయే మొగుడు రీల్స్‌ కూడా  చేయాలని కండిషన్‌ పెట్టేంతగా. వినడానికే వింతగా ఉన్నా... ఆమె ఇచ్చిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు... ఆ యువతి వరుడు కోసం పెట్టిన కండిషన్స్‌  చూసి... అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వరుడు కమ్‌ రీల్స్‌ పార్ట్‌నర్‌ కోసం వినూత్న ప్రకటన ఇచ్చిన ఆ  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు రియా. తన పేరు రియా అని... తాను తన జీవిత భాగస్వామి మరియు  రీల్‌ భాగస్వామి కోసం వెతుకుతున్నానని ఆమె ప్రకటన ఇచ్చింది. అందులో కొన్ని కండిషన్స్‌ కూడా పెట్టింది. అబ్బాయి కెమెరా చూసి సిగ్గుపడకూదట. అంతేకాదు.. తనతో  కలిసి రిలేషన్‌ షిప్‌ రీల్స్‌ చేయాలని కూడా ఆమె స్పష్టంగా చెప్పేసింది. అంతేకాదు... మోయి-మోయి వంటి ట్రెండింగ్‌ మ్యూజిక్‌లో రీల్స్ చేయడంలో అనుభవం కూడా  ఉండాలని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ కండిషన్స్‌ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయా..? ఇవే కాదు... ఇంకా కొన్ని షరతులు కూడా పెట్టింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్  రియా. 

అబ్బాయిది ఉమ్మడి కుటుంబం అయ్యి ఉండకూదని ప్రకటనలో తెలియజేసింది రియా. అంతేనా... తనను సంప్రదించే ముందు... అబ్బాయి అమెజాన్‌ మినీ టీవీలో ఉన్న హాఫ్  లవ్ అరేంజ్డ్‌ ప్రోగ్రామ్‌ని తప్పకుండా చూడాలట. అతనికి ప్రీమియర్ ప్రో గురించి తెలుసుండాలని.. రీల్స్, వ్లాగ్‌లను హ్యాండిల్‌ చేయగలిగి ఉండాలని ప్రకటన ఇచ్చింది.  వరుడి కోసం ఇచ్చిన ప్రకటనలో.. వింత కండిషన్స్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవేం కండిషన్స్‌ అంటూ నోరెళ్లబెడుతున్నారు. 

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా ఇచ్చిన ఈ వెరైటీ మ్యాట్రియోనియల్‌ యాడ్‌ వైరల్‌ కావడంతో... అబ్బాయిల నుంచి రియాక్షన్స్‌ వస్తున్నాయి. కొందరు ఫన్నీగా  కామెంట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయికి భర్త కావాలా... ఎడిటర్‌ కావాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రియా ప్రకటన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇవేం షరతులు  అంటూ నివ్వెరపోతున్నారు. ఏం చేస్తాం... సోషల్‌ మీడియా యుగం అని సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో... ఇంకెన్ని వింతలు చూడాలో ఏమో  అని.. చెవులు కొరుక్కుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Embed widget