Viral News: ఇది అదృష్టం కాదు, అంతకుమించి- అడుగేసిన వెంటనే కూలిపోయిన ఫుట్‌పాత్!
Viral News: ప్రమాదం నుంచి ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral News: సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు ఒక్కోసారి అవాక్కయ్యేలా చేస్తాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తికి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ వీడియోలో అతను నడిచిన వెంటనే ఫుట్‌పాత్ కుంగిపోయింది. రెడ్డిట్‌లో బుధవారం పోస్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
ఓ వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు దాని ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచాడు. అయితే అతడు పాపు మెట్లపై కాలు పెట్టిన వెంటనే ఆ ఫుట్‌పాత్ కుంగిపోయింది. దాని కింద లోతులో డ్రైనేజ్ ఉంది. దీంతో ఆ వ్యక్తి అవాక్కయి అలా నిల్చుండిపోయాడు.
ఫుట్‌పాత్ కుంగిపోవడం చూసి ఆ షాప్‌లోని వ్యక్తులు కూడా హడావుడిగా బయటకు వచ్చారు. డ్రైనేజీలోకి కుంగిన ఫుట్‌పాత్‌ను పరిశీలించారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.
సీసీటీవీలో
అయితే అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందించారు. ఆ వ్యక్తిని లక్కీ మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
మరో వీడియో
— Vishal Dharm (@VishalDharm1) August 3, 2022
కేరళ మలప్పురంలో కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఇంటిపైన భాగంలో శుభ్రం చేస్తుండగా.. పట్టుతప్పి కిందపడిపోయాడు. ఆ సమయంలో అతని సోదరుడు కింద ఉన్నాడు. టెర్రెస్ పైనుంచి కింద పడిపోతున్న సోదరుడిని గమనించి అతను క్యాచ్ పట్టేశాడు. ఈ ఘటనలో పైనుంచి పడిన వ్యక్తి పైకిలేచి మాములుగా లేచిపోయాడు. అయితే అతని అన్న మాత్రం కాసేపటికి పైకి లేచాడు. ఆ అన్న వెంటనే స్పందించకపోయి ఉంటే ఆ తమ్ముడికి కచ్చితంగా ఏదో ఒకగాయం అయ్యి ఉండేది. జులై 31న ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'వాట్ ఏ క్యాచ్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఆ అన్నయ్యను ప్రపంచకప్‌కు పంపించాలంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Bird Hit Go First Flight: ఈ విమానాలకు ఏమైంది?- పక్షి ఢీ కొట్టడంతో ఎమెర్జెన్సీ ల్యాండింగ్!
Also Read: China Taiwan Tensions: చైనా- తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు- సైనికుల కవాతు, యుద్ధ ట్యాంకులు!