(Source: ECI/ABP News/ABP Majha)
Viral News: మార్నింగ్ వాక్ కలిపింది ఇద్దరినీ- 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన యువతి!
Viral News: 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించి పెళ్లాడింది ఓ 19 ఏళ్ల యువతి. ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
Viral News: ప్రేమకు కులం, మతం, ప్రాంతమే కాదు వయసు కూడా అడ్డు కాదని నిరూపించింది పాకిస్థాన్‌కు చెందిన ఓ జంట. కుటుంబం, సమాజం ఏమనుకుంటుందని పట్టించుకోకుండా 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది 19 ఏళ్ల యువతి. ఇంతకీ వాళ్లకు ఎలా పరిచయమైందో తెలుసా?
అలా మొదలైంది
లియాఖత్ అలీ (70)కి రోజూ మార్నింగ్ వాక్‌కు వెళ్లడం అలవాటు. ఆ సమయంలో షుమైలా (19) అతడ్ని చూసింది. అలా వారి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి పీటలు ఎక్కింది. ఒక రోజున షుమైలా వెనుక జాగింగ్ చేస్తున్న లియాఖత్ ఒక పాట పాడుతూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ యువతి కూడా ఆ వృద్ధుడి ప్రేమకు ఓకే చెప్పింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
51 ఏళ్ల వయసు తేడా ఉన్న లియాఖత్ అలీ, షుమైలా దంపతులు తమ ప్రేమ పెళ్లి ముచ్చట్లను యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీతో పంచుకున్నారు. "ప్రేమలో పడిన వారు వయసును చూడరు" అని షుమైలా తెలిపింది. లియాఖత్‌తో పెళ్లికి తన కుటుంబం తొలుత అభ్యంతరం తెలిపిందని, అయితే చివరకు వారిని ఒప్పించినట్లు ఆమె చెప్పింది.
అయితే ఏంటి?
మరోవైపు వయసులో తేడా ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవచ్చని లియాఖత్ అలీ తెలిపాడు.
Also Read: Indonesia Earthquake: ఇండోనేసియాలో భూకంపం- 162కు చేరిన మృతుల సంఖ్య