Lok Sabha Election 2024: పోలింగ్‌బూత్‌పై మూకదాడి, ఈవీఎమ్ ఎత్తుకెళ్లి చెరువులో పడేసిన దుండగులు
Election 2024: బెంగాల్‌లో ఓ పోలింగ్‌బూత్‌పై దాడి చేసిన దుండగులు ఈవీఎమ్‌ని ఎత్తుకెళ్ల చెరువులో పడేశారు.
West Bengal: లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగానే ఉన్నా...ఎప్పటిలాగే బెంగాల్‌లో హింసాత్మక ఘనటలు చోటు చేసుకుంటున్నాయి. కుల్తలిలోని పోలింగ్ స్టేషన్‌లపై కొందరు మూకదాడి చేశారు. ఈవీఎమ్‌లు ఎత్తుకుపోయారు. పోలింగ్ బూత్‌కి దగ్గర్లో ఉన్న చెరువులో ఓ ఈవీఎమ్‌ని విసిరేశారు. ఫలితంగా పోలింగ్ నిలిచిపోయింది. ఒక్కసారిగా స్థానికంగా అలజడి రేగింది. భానగర్‌లోని సతులియా ప్రాంతంలోనూ ఇదే తరహా ఉద్రిక్తతలు కొనసాగాయి. సీపీఐ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కార్యకర్తలపై కొందరు దాడి చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ అల్లర్లలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కార్యకర్తలు కొందరు గాయపడ్డారు. నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
Democracy is burning in West Bengal. Bombs in Jadavpur’s Bhangar, villagers in Joynagar’s Kulti throwing EVMs in ponds due to TMC goons.
— Amit Rakksshit 🇮🇳 (Modi ka Parivar) (@amitrakshitbjp) June 1, 2024
Worst hit: Diamond Harbour, where her nephew Abhishek is contesting.@BJP4India workers are intimidated, their documents destroyed, and the… pic.twitter.com/ezTKjfWNNY
ఈ ఘటనలపై వెస్ట్ బెంగాల్ ఎన్నికల అధికారి స్పందించారు. కొందరు ఆందోళనకారులు వచ్చి బూత్‌పై దాడి చేశారని, ఈవీఎమ్‌ని చెరువులో పడేశారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఓ ఆరు పోలింగ్ బూత్‌లలో మాత్రం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని వివరించారు. వెస్ట్‌బెంగాల్‌లో 9 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
West Bengal Chief Electoral Office tweets, "Today morning at 6.40 am Reserve EVMs & papers of Sector Officer near Benimadhavpur FP school, at 129-Kultali AC of 19-Jaynagar (SC) PC has been looted by local mob and 1 CU, 1 BU , 2VVPAT machines have been thrown inside a pond...FIR… pic.twitter.com/fciLxNL9jL
— ANI (@ANI) June 1, 2024