అన్వేషించండి

Uttar Pradesh: ఇదేం భక్తిరా నాయనా- నాలుక కోసుకొని అమ్మవారికి సమర్పణ!

Uttar Pradesh: ఓ భక్తుడు తన నాలుక కోసుకొని దేవతకు సమర్పించిన ఘటన కలకలం రేపుతోంది.

Uttar Pradesh: కోరిన కోరికలు నెరవేర్చినందుకు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది కాలినడకన నడిచి కొండెక్కి దేవుడి దర్శనం చేసుకుంటారు. మరికొంతమంది ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెడుతుంటారు. అయితే ఓ భక్తుడు చేసిన పని మాత్రం కలకలం రేపుతోంది. నాలుక కోసుకొని దేవతకు సమర్పించాడు ఓ వ్యక్తి.

ఇదీ జరిగింది

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కడధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శీతలా మాత గుడిని సందర్శించడానికి వచ్చిన ఓ భక్తుడు తన నాలుకను కోసుకుని ఆలయ గుమ్మంలో పెట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ భక్తుడి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గుడికి వెళ్లి

పశ్చిమ శిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పురబ్ షిరా గ్రామానికి చెందిన సంపత్ (38).. అతని భార్య బన్నో దేవితో కలిసి శనివారం శీతలా మాతను దర్శించుకునేందుకు వచ్చారు. గంగా స్నానం అనంతరం సంపత్ తన సతీమణితో కలిసి శీతలా మాతకు పూజలు చేశారు. ఇద్దరూ ఆలయంలో ప్రదక్షిణలు చేసి తిరిగి వస్తుండగా.. సంపత్ బ్లేడ్‌తో తన నాలుకను కోసుకొని ఆలయ గుమ్మంలో పెట్టాడు.

కలకలం

ఇది చూసిన ఆలయంలోని ఇతర భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సంపత్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

శుక్రవారం రాత్రి తన భర్త శీతలా మాతను చూడాలని చెప్పినట్లు సంపత్ భార్య తెలిపింది. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరూ గంగా స్నానం చేసి ఆలయంలో పూజలు చేయగా.. తన భర్త హఠాత్తుగా ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

" శీతలా మాతను చూడాలని ఉందని నా భర్త కోరాడు. దీంతో ఆయన కోరికను కాదనడం ఎందుకని ఉదయాన్నే గుడికి తీసుకువచ్చాను. గంగా స్నానం చేసి, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాం. తరువాత దర్శనానికి గుడి లోపలికి వెళ్లాం. ఏమైందో తెలీదు.. హఠాత్తుగా నా భర్త.. బ్లేడుతో నాలుక కట్ చేసుకొని ఆలయ గుమ్మం ముందు ఉంచాడు. ఇంత పని చేస్తాడని నేను అసలు అనుకోలేదు.                                                                               "
-బన్నో దేవి, బాధితుడి భార్య

" శనివారం ఈ ఘటన జరిగింది. సంపత్ అనే వ్యక్తి శీతలా మాతను దర్శించుకున్న తర్వాత హఠాత్తుగా తన నాలుక కోసుకొని దేవికి సమర్పించాడు. ఇది చూసి అక్కడి భక్తుల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకొని సంపత్‌ను ఆసుపత్రికి తరలించాం. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.                           "
-అభిలాష్ తివారీ, ఎస్‌హెచ్‌ఓ 

Also Read: Krishnam Raju Death News: కృష్ణంరాజు మరణంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Also Read: Queen Elizabeth Death: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్-II మృతికి నివాళిగా భారత్‌లో సంతాపదినం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget