Anti Cold Drug: నాలుగేళ్ల లోపు చిన్నారుల జలుబు మందుపై నిషేధం, భారత్ సంచలన నిర్ణయం
Anti Cold Drug Ban: నాలుగేళ్ల లోపు చిన్నారులకు యాంటీ కోల్డ్ డ్రగ్ కాంబినేషన్‌పై కేంద్రం నిషేధం విధించింది.
Anti Cold Drug Banned in India:
ఆ దగ్గు మందుపై నిషేధం..
ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలోపు చిన్నారులకు యాంటీ కోల్డ్ డ్రగ్ (Anti Cold Drug Banned) వాడడాన్ని నిషేధించింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే లేబులింగ్ జరగాలని తేల్చి చెప్పింది. దగ్గుమందు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 141 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంటీ కోల్డ్ డ్రగ్ కాంబినేషన్‌ని బ్యాన్ చేసింది భారత్. ఎలాంటి అప్రూవల్ లేని యాంటీ కోల్డ్ డ్రగ్ ఫార్ములేషన్స్‌ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి విక్రయిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ మందు కారణంగా చిన్నారుల ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతోంది. అందుకే...ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు పొరపాటున కూడా ఈ మందు ఇవ్వొద్దని సూచించింది కేంద్రం. ఆ మేరకు ఆంక్షలు విధించింది. 2019 నుంచి భారత్‌లో ఈ దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందారు. గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్‌లోనూ ఈ మరణాలు నమోదయ్యాయి. భారత్‌లోని చిన్నారుల మరణానికి ఏ డ్రగ్స్ అయితే కారణం అయ్యాయో అవే విదేశాల్లోని చిన్నారుల ప్రాణాలు తీశాయి. ఇది ఒక్కసారి అలజడి సృష్టించింది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మందులపై నిఘా పెరిగింది. తక్కువ ధరకే ఔషధాలు లభిస్తుండడం వల్ల పలు దేశాలు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ మార్కెట్‌ని ఆ కాఫ్ సిరప్‌లు దెబ్బ తీశాయి. అందుకే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 18న India Drug Regulator ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ నుంచే నియంత్రణ..
మందులు తయారు చేసే కంపెనీలు తప్పనిసరిగా తమ ప్రొడక్ట్స్‌ని లేబుల్ చేయాలని తేల్చి చెప్పింది. fixed-drug combination వార్నింగ్ కూడా దానిపై మెన్షన్ చేయాలని స్పష్టం చేసింది. నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఈ మందు వినియోగించకూడదని ఆ మందులపై ప్రస్తావించాలని ఆదేశించింది. సాధారణంగా జలుబు మందుల్లో chlorpheniramine maleate ఉంటుంది. కానీ...ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కాంబినేషన్‌ని వాడకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు ఈ మందు ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయని చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి దగ్గు మందుల ఎగుమతులపై నిఘా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ మందులను తప్పనిసరిగా టెస్ట్ చేయాలని నిబంధన విధించింది. తామేమీ తప్పు చేయలేదని ఆయా కంపెనీలు చెబుతున్నప్పటికీ...కేంద్ర మాత్రం ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహిస్తోంది.