అన్వేషించండి

Trump tariffs: ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టు సూపర్ షాక్ - గ్లోబల్ టారిఫ్స్‌ను కొట్టివేత

US Supreme Court : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్స్ పై అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అవి చెల్లవని కొట్టివేసింది.

US Supreme Court strikes down Trump global tariffs:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో ప్రపంచవ్యాప్త దిగుమతులపై విధించిన భారీ టారిఫ్స్‌ను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వాడే  ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ను ఉపయోగించి అధ్యక్షుడు ఏకపక్షంగా ఇలాంటి పన్నులు విధించడానికి వీల్లేదని 6-3 మెజారిటీతో కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన ఈ విధానాన్ని న్యాయస్థానం తప్పుబట్టడం ఆయన పరిపాలనకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.    

 
అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్స్ లేదా పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు  అంటే పార్లమెంటు మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. 1977 నాటి అత్యవసర చట్టం అనేది ఆంక్షలు లేదా విదేశీ ఆస్తుల స్తంభన వంటి చర్యలకే పరిమితమని, దీనిని అడ్డుపెట్టుకుని అన్ని దేశాల వస్తువులపై పన్నులు వేయడం ఆ చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తులు వివరించారు. ఈ తీర్పుతో గత కొంతకాలంగా ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. 

 
ట్రంప్ విధించిన ఈ పన్నుల వల్ల అమెరికాలోని వ్యాపార సంస్థలు, వినియోగదారులపై దాదాపు  200 బిలియన్ డాలర్ల అదనపు భారం పడిందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. కేవలం విదేశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ టారిఫ్స్ వల్ల అమెరికాలోనే ద్రవ్యోల్బణం పెరిగిందని సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటివరకు వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
కోర్టు తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం టారిఫ్స్ అత్యవసరమని, ఇది అమెరికాకే నష్టమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఎమర్జెన్సీ చట్టం కింద విధించిన పన్నులకే వర్తిస్తుంది. ఇతర చట్టాల ద్వారా  నిర్దిష్ట వస్తువులపై టారిఫ్స్ వేసే అవకాశం ఇంకా అధ్యక్షుడికి ఉంది. ఈ  క్రమంలో ట్రంప్ ప్రభుత్వం మరిన్ని న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించే అవకాశం కనిపిస్తోంది.                                                

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget