Arunachal: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే, చైనా వాదనలో అర్థం లేదు - తీర్మానించిన అమెరికా
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగమే అని అమెరికా తీర్మానించింది.
![Arunachal: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే, చైనా వాదనలో అర్థం లేదు - తీర్మానించిన అమెరికా US Resolution Recognises Arunachal As Integral Part Of India, Condemns China’s Military Aggression, know details Arunachal: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే, చైనా వాదనలో అర్థం లేదు - తీర్మానించిన అమెరికా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/2c8131cf801bc0b9575add8e333e1df21678861296718517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Arunachal Integral Part India:
ఎన్నో ఏళ్లుగా వివాదం..
అరుణాచల్ ప్రదేశ్ విషయమై చైనా ఎన్నో ఏళ్లుగా భారత్‌తో తగువులాడుతోంది. అరుణాచల్ తమ దేశంలో భాగమే అంటూ వాదిస్తోంది. భారత్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చాలా సార్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌కు మద్దతుగా నిలిచింది. మెక్‌మహాన్ రేఖకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా పాస్ చేసింది. మెక్‌మహాన్ రేఖను అరుణాచల్ ప్రదేశ్, చైనా మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది.
"ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని చైనా చూస్తోంది. ఇలాంటి సమయంలో వ్యూహాత్మక మైత్రి ఉన్న దేశాలతో అమెరికా మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. ముఖ్యంగా భారత్‌కు తప్పకుండా అండగా ఉంటాం"
- సెనేటర్
అంతే కాదు. ఇదే తీర్మానంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పింది అమెరికా. ఎల్‌ఏసీ విషయంలో భారత్‌తో జరిగిన ఒప్పందాలను చైనా ఖాతరు చేయకపోవడంపై మండి పడింది. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని వెల్లడించింది. దాదాపు ఆరేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. గల్వాన్ ఘటనతో అది రుజువైంది. అరుణాచల్ ప్రదేశ్‌ను PRCలో భాగమే అన్న చైనా వాదనను అమెరికా చాలా తీవ్రంగా ఖండిస్తోంది.
" చైనా, భారత్.. దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, సుస్థిరతను కొనసాగించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి. చైనా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. "
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)