US Travel Advisory: భారత్‌కి ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసిన అమెరికా, ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచన
US Travel Advisory: భారత్‌కు అమెరికా ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసింది.
US Travel Advisory:
కలర్ కోడ్ ఆధారంగా అడ్వైజరీలు..
భారత పౌరులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసింది అమెరికా. మొత్తం నాలుగు రకాల అడ్వైజరీలను పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్...ఈ అమెరికన్ ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేసింది. కలర్ కోడ్ ఆధారంగా వీటిని నాలుగు రకాలుగా విభజించింది. 1-4 అంకెలను వీటికి కేటాయించింది. నంబర్ 1..అంటే తెలుపు రంగు కోడ్ ఉంటే...ఆ ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం అని అర్థం. నంబర్ 4...అంటే ఎరుపు రంగు కోడ్. ఈ కలర్ కోడ్ ఇస్తే...ఆ ప్రాంతం నో ట్రావెల్ జోన్‌గా అర్థం చేసుకోవాలి. చాలా ఏళ్ల క్రితం ఇలాంటి కలర్ కోడింగ్‌తో భారతీయుల్ని అప్రమత్తం చేసిన అమెరికా..మళ్లీ ఇన్నాళ్లకు ఇదే విధానం అమలు చేస్తోంది. వీటిని లెవల్ 2, లెవల్ 3 అడ్వైజరీలుగా పిలుస్తారు. ఎక్కువ సార్లు లెవల్ 2 అడ్వైజరీలనే ఇచ్చింది అగ్రరాజ్యం. గతేడాది ఏప్రిల్‌లో కొవిడ్ సంక్షోభం తారస్థాయిలో ఉన్నప్పుడు లెవల్ 4 అడ్వైజరీలు జారీ చేసింది. అప్పటి నుంచి క్రమంగా ఈ లెవల్‌ను తగ్గించుకుటూ వచ్చింది. లెవల్ 3 అడ్వైజరీ జారీ చేసినప్పుడు..."భారతీయులు అమెరికాకు వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి" అని అని వెల్లడించింది అగ్రరాజ్యం. ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు ఈ తరహా అడ్వైజరీలు ఇచ్చింది. మార్చి 28న, జులై 25న, మళ్లీ ఇప్పుడు అక్టోబర్ 5వ తేదీన మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోని నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే...ఇటు భారత్‌లో మాత్రం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఓ ప్రాంతంలో శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు, ప్రజారోగ్యం క్షీణించినప్పుడు, ఉగ్రవాదం పెరిగినప్పుడు ఇలాంటి అడ్వైజరీలు చేస్తుంది అమెరికా.
అంతకు ముందు కెనడా..
ఇటీవల కెనడా తన పౌరులకు ఇటీవల ఓ విచిత్రమైన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్థాన్‌తో సరిహద్దులను పంచుకునే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ప్రయాణాలు మానుకోవాలని తమ పౌరులకు సూచించింది. ఈ అడ్వైజరీపై భారత్ ఘాటుగా స్పందించింది. భారత్‌లోని గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రయాణాలు మానుకోవాలని కెనడా తన అడ్వైజరీలో పేర్కొంది. ల్యాండ్‌మైన్‌ల ఉనికి, అనూహ్య భద్రతా పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ప్రయాణాలు నివారించాలని సూచించింది. తీవ్రవాద దాడుల ముప్పు కారణంగా భారత్‌లో పర్యటించే కెనడా పౌరులు అధిక స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు సెప్టెంబరు 27న కెనడా ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ట్రావెల్ అడ్వైజరీని పోస్ట్ చేసింది. కెనడా ట్రావెల్ అడ్వైజరీ, ఖలీస్థాన్‌పై కెనడా రెఫరెండం నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కౌంటర్ ఇచ్చారు.
Also Read: Crimea Bridge Collapse: సెక్యూరిటీ పెంచిన పుతిన్, క్రిమియా బ్రిడ్జ్‌పై బాంబు దాడిపై సీరియస్
Also Read: Anand Mahindra - NTR : కొత్త కారుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న ఆనంద్ మహీంద్రా