By: Ram Manohar | Updated at : 08 Jan 2023 03:34 PM (IST)
అమెరికాలో అన్ని రిటైల్ ఫార్మసీల్లో అబార్షన్ పిల్స్ విక్రయించేందుకు అనుమతి.
Abortion Pills in US:
అమెరికా కీలక నిర్ణయం..
అమెరికాలోని ఫార్మసీల్లో ఇకపై అధికారికంగా అబార్షన్ పిల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రిస్క్రిప్షన్ చూపించి ఆ పిల్స్ కొనుగోలు చేయచ్చు. ఈ వారం నుంచే ఇది అమల్లోకి రానుంది. గతేడాది అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ చేయించుకోడాన్ని నిషేధించారు. మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దీనిపై నిషేధం లేదు. ఫలితంగా...ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. అబార్షన్ పిల్స్ విక్రయించేందుకు అనుమతినిచ్చింది. గతేడాది అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్ రాజ్యాంగ హక్కు కాదని సంచలన తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆ దేశంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. Food and Drug Administration (FDA) ప్రస్తుతానికి రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసి రిటైల్ ఫార్మసీలు అబార్షన్ పిల్స్ విక్రయించేలా పర్మిషన్ ఇచ్చింది. Mifepristone పిల్ అమ్మేందుకు అనుమతినిచ్చింది. ఈ ట్యాబ్లెట్...గర్భం దాల్చకుండా అడ్డుకుంటుంది. అయితే..గర్భం దాల్చిన 10 వారంలో ఈ పిల్ వాడాలని సూచించింది. సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటి నుంచి బైడెన్ యంత్రాంగం ఈ హక్కుని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గర్భం తొలగించుకోవాలని చూస్తున్న మహిళలకు ప్రస్తుత
నిర్ణయం కాస్త ఊరటనిచ్చింది. అయితే..మెడికల్ కన్సల్టేషన్ లేకుండా మాత్రం ఈ పిల్స్ విక్రయించరు. కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. గతంలో కేవలం కొన్ని స్పెషల్ డ్రగ్ స్టోర్స్‌లో మాత్రమే ఈ పిల్స్ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అన్ని రిటైల్ స్టోర్స్‌లోనూ ఉంటాయి. కనీసం రెండు రోజుల పాటు ఇవి వేసుకుంటేనే అబార్షన్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
గతేడాది తీర్పు...
అమెరికా సుప్రీంకోర్టు గతేడాది జులైలో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకూ రాజ్యాంగ హక్కుగా ఉన్న అబార్షన్స్ చారిత్రక తీర్పు వెలువరించింది. చరిత్రాత్మక Roe Vs Wade Ruling ను అమెరికా సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. దీని ఫలితంగా అమెరికాలో ఇప్పటివరకూ రాజ్యాంగ హక్కుగా ఉన్న అబార్షన్స్ ను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకున్నట్లైంది. అమెరికాలో అబార్షన్స్ ను రాజ్యాంగ హక్కుగా తొలగించాలన్న తీర్పుకు అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు ఓటు వేశారు. ముగ్గురు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో అబార్షన్స్ పై అమెరికాలో నిషేధం పడింది. అమెరికా మహిళలు ఇప్పటివరకూ రాజ్యాంగహక్కుగా ఉన్న అబార్షన్స్ చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ప్రత్యేకించి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే టెక్సాస్ సహా పదమూడు రాష్ట్రాల్లో తక్షణమే లేదా నెలరోజుల్లో ఈ నిషేధం అమలు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ప్రతీ ప్రాణానికి ఈ భూమిపై బతికే హక్కు ఉందని ఈ తీర్పు తమ విజయంగా రిపబ్లికన్లు ప్రకటించుకున్నారు. డెమొక్రాట్లు మాత్రం ఈ తీర్పుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అబార్షన్ అనేది మానవహక్కుగానే ఉండాలని ట్వీట్ చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది.
Also Read: China on Covid-19: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా, విదేశీ ప్రయాణికులకు నో క్వారంటైన్
ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు
Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
Pakistan Crisis: IMF పెట్టిన కండీషన్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మాకు వేరే ఆప్షన్ కూడా లేదు - పాక్ ప్రధాని
ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!