![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీలో చేరిన యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య
యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయన మద్దతుదారులతో పాటు అఖిలేశ్ పార్టీలోకి వెళ్లారు.
![UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీలో చేరిన యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య UP Assembly Election 2022: Former BJP Minister Swami Prasad Maurya Officially Joins Hands With Samajwadi Party UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీలో చేరిన యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/858a4289ac3e4d37424425b8ec0ce065_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌కు రాజీనామా చేసి బయటకు వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. యూపీ మాజీ సీఎం, సమజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఎన్నికల సంఘం చెప్పిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా వర్చువల్ ర్యాలీగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మౌర్యతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
9 మంది రాజీనామా..
స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైన రాజీనామాల పర్వం యూపీలో కొనసాగుతోంది. ఆయన రాజీనామా చేసిన తర్వాత 3 రోజుల్లో మరో 8 మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడారు. అంటే మొత్తం 9 మంది రాజీనామా చేసినట్లైంది. ఇందులో ముగ్గురు మంత్రులు ఉన్నారు.
దళితులను విస్మరించారు..
స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2016లో ఆయన భాజపాలో చేరారు. అప్పటి నుంచి అఖిలేశ్ యాదవ్ పార్టీకి ఓబీసీ ఓటర్లను దూరం చేసే ప్రణాళికల్లో ముఖ్యపాత్ర పోషించారు మౌర్య.
తాను రాజీనామా చేయడానికి దళితులపై భాజపా చిన్నచూపు వైఖరే కారణమని మౌర్య రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)