అన్వేషించండి

Unusual wedding: ఒక్క పెళ్లికూతురు, ఇద్దరు పెళ్లికొడుకులు - ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ చూసి ఉండరు!

Uttar Pradesh: పెళ్లి కుమార్తె పెళ్లికి రెడీ అయింది. పెళ్లి సమయంలో తామే పెళ్లికొడుకు అని చెప్పుకుని ఇద్దరు ఊరేగింపుగా వచ్చారు. తర్వాత ఆసలు ట్విస్ట్ పోలీసులు ఇచ్చారు.

One bride two grooms: ఉత్తరప్రదేశ్‌లో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. తాజాగా యూపీలో ఒకే మండపంలో, ఒకే వధువుకు ఇద్దరు వరులు పెళ్లి కొడుకులుగా వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

 ఒకే ముహూర్తం.. ఇద్దరు వరులు 

ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీ ప్రాంతంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే వధువును వివాహం చేసుకోవడానికి వేర్వేరు ప్రాంతాల నుండి ఇద్దరు వరులు తమ తమ ఊరేగింపులతో  వధువు ఇంటికి చేరుకున్నారు. బ్యాండ్ బాజాలతో వచ్చిన ఈ ఇద్దరినీ చూసి పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒకరు షామ్లీ జిల్లాకు చెందిన వరుడు కాగా, మరొకరు మీరట్ జిల్లాకు చెందిన వ్యక్తి. తమకే పెళ్లి ఖాయమైందని ఇరు పక్షాలు వాదించుకోవడంతో మండపం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తల్లిదండ్రుల వ్యూహం.. బయటపడ్డ అసలు విషయం                       

అసలు విషయం ఏమిటంటే, వధువు తల్లిదండ్రులు మొదట ఒక వరుడితో పెళ్లి నిశ్చయించారు. అయితే, ఆర్థికపరమైన కారణాల వల్లనో లేదా ఇతర గొడవల వల్లనో ఆ సంబంధం క్యాన్సిల్ అయిందని భావించి, చివరి నిమిషంలో హడావిడిగా మరొక వరుడిని సిద్ధం చేశారు. కానీ, మొదటి వరుడు తమకు పెళ్లి రద్దు కాలేదని భావించి ముహూర్త సమయానికి ఊరేగింపుగా వచ్చేశాడు. అప్పటికే అక్కడ రెండో వరుడు పెళ్లి పీటల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండటంతో అసలు రచ్చ మొదలైంది.

పోలీసుల ఎంట్రీతో ముగిసిన డ్రామా 

పెళ్లి మండపం కాస్తా పంచాయితీగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని ఆరా తీయగా మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆ వధువు మైనర్ అని, ఆమె వయసు ఇంకా పెళ్లికి తగినంత లేదని విచారణలో తేలింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ వివాహాన్ని తక్షణమే నిలిపివేశారు. చివరకు ఇద్దరు వరులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.            

వైరల్ అవుతున్న విచిత్రమైన పెళ్లిళ్లు                              
 
యూపీలోనే మరో వైపు, ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకుని, ఇద్దరి పేర్లతో రెండు మంగళసూత్రాలు ధరించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తామంతా ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్నామని ఆమె చెప్పడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇలాంటి పద్ధతులు కొన్ని గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయంగా ఉన్నప్పటికీ, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.                                             

టాప్ హెడ్ లైన్స్

Cyclone Akwan: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్.. మరికొన్ని గంటల్లో తుపానుగా మారనున్న వాయుగుండం
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్.. మరికొన్ని గంటల్లో తుపానుగా మారనున్న వాయుగుండం
Xi Trump Putin summit: జిన్‌పింగ్ ట్రంప్ పుతిన్ త్రైపాక్షిక భేటీ.. 'న్యూ యాల్టా' సమావేశం పట్ల చైనా తర్జనభర్జనలు!
జిన్‌పింగ్ ట్రంప్ పుతిన్ త్రైపాక్షిక భేటీ.. 'న్యూ యాల్టా' సమావేశం పట్ల చైనా తర్జనభర్జనలు!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Embed widget