అన్వేషించండి
Advertisement
Rahul Gandhi: 'రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాన మంత్రి కాలేరు'
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన జీవితంలో ఎప్పటికీ ప్రధాన మంత్రి కాలేరని కేంద్ర మంత్రి రామ్‌థాస్ అథవాలే అన్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాన మంత్రి కాలేరని కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే జోస్యం పలికారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీ ఆయనను ప్రధానిని చేయాల్సిందన్నారు.
" దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోంది. ఆయన స్థానాన్నీ భర్తీ చేసే నాయకుడే లేరు. రాహుల్ గాంధీకి అది సాధ్యం కాదు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీ తన కుమారుడ్ని ప్రధానిని చేసుండాల్సింది. సమయం దాటిపోయింది. ఇక రాహుల్ ఎప్పటికీ ప్రధాని అయ్యే అవకాశమే లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 స్థానాలకుపైగా కైవవం చేసుకుంటుంది. అలాంటప్పుడు రాహుల్ ఎలా ప్రధాని అవుతారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావు. "
- రామ్‌దాస్ అథవాలే, కేంద్రమంత్రి
జోడో యాత్ర
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతోన్న భారత్ జోడో యాత్ర ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుంది. జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా వస్తున్నారు. తనపై భాజపా చేస్తోన్న విమర్శలకు రాహుల్ గాంధీ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
" నేను విద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను. నేను ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాను అని అడిగే భాజపా నాయకులకు ఇదే నా సమాధానం. మీరు నన్ను ద్వేషిస్తున్నారు. మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు.. ఇది మీ హృదయం. మీ హృదయం ద్వేషంతో నిండిపోయింది. మీది విద్వేషాల మార్కెట్. కానీ నా దుకాణం ప్రేమతో కూడుకున్నది. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
" కాంగ్రెస్ కార్యకర్తలు నాకు ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడం చూసి చాలా ఆనందం వేసింది. అయితే భాజపా కార్యాలయాల మీదుగా యాత్ర సాగినప్పుడు వారు కూడా మొదట సంకోచించి.న తర్వాత నావైపు చేతులు ఊపేవారు.ఎందుకంటే మనది దేశం ప్రేమ దేశం. నన్ను ఎంత తిట్టినా నేను భాజపా వారిని ద్వేషించను. కానీ నేను నా భావజాలానికి కట్టుబడి ఉన్నాను. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion