Union Budget 2023: ఇది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్
Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Union Budget 2023:
అన్ని విధాలుగా న్యాయం..
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పద్దుపై మాట్లాడారు. వనరులు, వ్యయాలను బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్‌ను రూపొందించినట్టు స్పష్టం చేశారు. మూల ధన వ్యయం నుంచి సాధారణ ప్రజలకు మేలు చేకూర్చే వరకూ అన్ని విధాలుగా న్యాయం చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించినట్టు తెలిపారు. డైరెక్ట్ ట్యాక్స్ విధానాన్ని సింప్లిఫై చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ బడ్జెట్‌లో ఆ కల నెరవేరిందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తేందుకు కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. పన్ను విధానాన్నీ సరళతరం చేసినట్టు చెప్పారు. MSME సెక్టార్ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా రుణాలు అందించేందుకు ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్.
"ఎలాంటి పన్ను మినహాయింపుల్లేని పన్ను విధానాన్ని తయారు చేయాలని అనుకున్నాం. అదే చేశాం. కొత్త పన్ను విధానం సులువుగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఈ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్‌ను తయారు చేశాం. దాదాపు అన్ని రంగాల్లోనూ డిజిటల్ ఎకానమీ
సృష్టించడమే మా లక్ష్యం"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
The new taxation regime has now got greater incentives, and attractions so that people can unhesitatingly move from the old to the new. We are not compelling anyone. But the new one is now attractive as it gives greater rebates: Union Finance Minister pic.twitter.com/dzVYj0mtCd
— ANI (@ANI) February 1, 2023
We are looking at a futuristic fintech sector, people will be trained through Industrial Revolution 4.0, we are trying to unleash digital economy in various walks of life: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/ZDLL4geQFe
— ANI (@ANI) February 1, 2023
MSMEలకు ప్రోత్సాహకాలు...
ఉద్యోగాల సృష్టిపైనా కేంద్రం దృష్టి సారించిందని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. ఫిన్‌టెక్ కంపెనీలకు భారత్‌లో మంచి అవకాశాలు న్నాయని అన్నారు. భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి MSMEలు ఇంజిన్ లాంటివని, అందుకే ఆ సెక్టార్‌కు భారీ కేటాయింపులు చేశామని తెలిపారు. మహిళా సాధికారతకూ ప్రాధాన్యతని చ్చామని తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. మోడీ సర్కార్ ఈ బడ్జెట్ పట్ల విపక్ష నేత సంతోషం వ్యక్తం చేయడం లేదు. 'రైతులు, జవాన్, యువతకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేవని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. బిజెపి బడ్జెట్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండింటినీ పెంచుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలష్ యాదవ్ విమర్శించారు.
Also Read: Mamata Banerjee: నాకో అరగంట టైమ్ ఇస్తే ఇంత కన్నా మంచి బడ్జెట్ తెస్తా - మమతా బెనర్జీ