Ukraine Russia Conflict: ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ- రష్యాతో ఉద్రిక్తతల వేళ కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌లో ఎమెర్జెన్సీ అమలు చేసింది ఆ దేశ సర్కార్. రష్యాతో ఉద్రిక్తతల వేళ కీలక నిర్ణయం తీసుకంది.
రష్యాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ వ్యాప్తంగా అన్నిప్రాంతాల్లోనూ ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు ఉన్నతా భద్రతాధికారి వెల్లడించారు.
Ukraine's top security official says Ukraine to introduce state of emergency in all Ukrainian territory apart from Donetsk and Luhansk regions. Ukraine's top security official says the state of emergency would last 30 days and can be extended for another 30 days: Reuters
— ANI (@ANI) February 23, 2022
డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను మినాహాయించి ఉక్రెయిన్ మొత్తం ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు. 30 రోజుల వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. అవసరమైతే మరో 30 రోజులు పొడిగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు రైటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
రష్యా దూకుడు
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి డొనెట్స్క్, లుహాన్స్క్ రెండింటిని స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామన్నారు. ఈ ప్రాంతాలకు రష్యా నుంచి మిలిటరీ సహకారం ఉంటుందని తెలిపారు.
అమెరికా ఆంక్షలు
ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతోన్న చర్యలకు ప్రతిగా అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. శ్వేతసౌథంలో జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైందన్నారు.
ఉక్రెయిన్
రష్యాలో ఉండే తమ పౌరులు తక్షణం ఆ దేశాన్ని విడిచి రావాలని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ పౌరులపై కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను రష్యా ప్రత్యేకంగా గుర్తించింది. అక్కడి వేర్పాటు వాదులు రష్యాకు అనుకూలంగా ఉన్నారు.
Also Read: Russia Ukraine Crisis: రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపించిన అమెరికా- పుతిన్ దూకుడు ఆపుతారా?
Also Read: Russia Ukraine Conflict : క్షణం ఆలస్యం చేయకుండా రష్యాను వదిలి పెట్టండి - పౌరులకు ఉక్రెయిన్ పిలుపు !