Ujjain : నడిరోడ్డుపై రేప్ - వీడియో తీస్తూ చూసిన జనం - మధ్యప్రదేశ్‌లో ఘోరం
Man Rapes Her On Footpath : నడి రోడ్డుపై హత్యలు చేసి పరారయ్యేవాళ్లను చూసుంటాం కానీ.. నడి రోడ్డు మీద పట్టపగలు రేప్ చేసే వాళ్లని చూసి ఉండం. కానీ ఆ ఘోరాన్ని కూడా చూపించాడు మధ్యప్రదేశ్‌లోని ఓ రేపిస్ట్ .
Ujjain Man Rapes Her On Footpath In MP Bystander Shoots Act : ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు. అయినా సరే ఆ కీచకుడికి ఏమీ అనిపించలేదు. మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన మహిళపై ఫుట్ పాత్ పైనే బలాత్కారం చేశాడు. అతను అత్యాచారం చేస్తున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా .. అందరూ ఫోన్లు తీసుకుని షూట్ చేయడం ప్రారంభించారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఈ ఘోరం జరిగింది.
నడి రోడ్డులో రేప్ చేసిన వ్యక్తి
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఓ మహిళపై ఓ వ్యక్తి రోడ్డుపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతని పేరు లోకేష్ అని.. బలాదూర్‌గా తిరికే వ్యక్తి చెత్త ఏరుకునే అమ్మాయిని ట్రాప్ చేశాడని గుర్తించారు. మద్యం అలావాటు చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వెంట తిప్పుకుంటున్నాడు.అగార్ నఖా ఏరియాలో ఆమె చెత్త ఏరకుంటున్న సమయంలో అక్కడకు వచ్చిన లోకేష్ ఆమెను బలవంతంగా వివస్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నాడని తెలిసినా ఒక్కరు కూడా ఆపలేదు.
ये वीडियो बनाने वाले और खड़े होकर देखने वाले उसी समाज के लोग हैं। जिसमें हम रह रहे हैं। हमारे आस पास के ही लोग हैं जो बस इंटरनेट पर भौंकते है। वो भी खुद की पब्लिसिटी के लिए।
— Anshuman Singh (@itsanshhuman) September 6, 2024
शर्म आती है ऐसे समाज पर।#Ujjain #MadhyaPradesh #ShameOnUs pic.twitter.com/2EwZDEjdJ2
కాంగ్రెస్ పార్టీలోకి స్టార్ రెజ్లర్లు - అధికారంగా చేరిన వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా
బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పట్టించుకోవడం లేదని ఆరోపణ
మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ ఘోరమైన అత్యాచారం గురించి చెప్పడం లేదని.. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించారు.
A woman was raped in broad daylight on the streets of Ujjain, Madhya Pradesh, while bystanders filmed instead of helping. Where are we headed as a society?
— Dr. Shama Mohamed (@drshamamohd) September 6, 2024
Since this happened in a BJP-ruled state, mainstream media and BJP leaders may not express the same outrage as they did in… pic.twitter.com/GjxV0PBTV6
నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులు అరెస్టు చేశారు. మహిళను పునరావస కేంద్రానికి పంపించారు. కోర్టు రేపిస్టుకు రిమాండ్ విధించింది. ఈ అంశంపై మధ్యప్రదేశ్ ప్రబుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.