Udhayanidhi Stalin TN Minister: మంత్రిగా ఉదయనిధి స్టాలిన్- కీలక శాఖ అప్పగించిన సీఎం
Udhayanidhi Stalin TN Minister: తమిళనాడు కేబినెట్‌లో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు.. సీఎం స్టాలిన్ అవకాశం కల్పించారు.
Udhayanidhi Stalin TN Minister: డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖను కేటాయించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేశారు.
ట్వీట్
ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్.. తన తండ్రి, సీఎం ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
எப்போதும் வழிநடத்தும் மாண்புமிகு முதலமைச்சர்@mkstalin அவர்களிடம், சமூகநீதி திட்டங்களை செயல்படுத்தி தமிழர் நலன் காக்கும் திராவிட மாடல் அரசின் அமைச்சரவையில் பங்கேற்க வாய்ப்பளித்ததற்கு நன்றி தெரிவித்து வாழ்த்து பெற்றேன். பதவியாக கருதாமல் பொறுப்பாக உணர்ந்து என்றும் பணியாற்றிடுவேன். pic.twitter.com/M43S8kRcFO
— Udhay (@Udhaystalin) December 14, 2022
ఈ సందర్భంగా మెరీనా బీచ్ సమీపంలోని తన తాతయ్య, తమిళనాడు మాజీ సీఎం, దివంగత కరుణానిధి స్మారకం వద్ద ఉదయ్ నివాళులర్పించారు. అనంతరం EVR పెరియార్ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శించి, చెన్నైలోని అన్బళగన్ ఇంటికి ఉదయ్ వెళ్లనున్నారు. తర్వాత గోపాలపురం, సీఐటీ కాలనీలోని తన అమ్మమ్మ ఇంటి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోనున్నారు.
తొలిసారి
తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయ్.. యువజన విభాగం కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే విపక్షాలు మాత్రం కుటుంబ పాలన అంటూ ఆయనపై ఆరోపణలూ చేస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉదయనిధి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో 70 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తన ప్రచారం ద్వారా ఉదయనిధి స్టాలిన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల్లో DMK ఘన విజయం తర్వాత, స్టాలిన్.. ఆయన్ను పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా ప్రకటించారు. యువజన విభాగం నాయకుడిగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక నిరసనలను ఉదయనిధి చేపట్టారు.
Also Read: Gay Marriage Law: సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుపై బైడెన్ సంతకం- ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్