By: Ram Manohar | Updated at : 18 Jul 2022 11:18 AM (IST)
శిందే, ఠాక్రే రెండ్రోజుల్లో కలవనున్నట్టు మరాఠీ నటి దీపాలి ట్వీట్ చేశారు.
సమస్యలు పరిష్కరించుకుంటారు: దీపాలి
మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర అప్‌డేట్ వస్తోంది. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతునిస్తూ ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటన షాక్ ఇచ్చింది. పైగా భాజపాతో మళ్లీ కలిసేందుకు అవకాశాలున్నాయన్న సంకేతాలూ ఇచ్చింది ఆ ప్రకటన. ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. త్వరలోనే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కలవబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అందులో నిజమెంత అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మరాఠీ నటి దీపాలి సాయేద్ చేసి ట్వీట్ చేయటంతోనే
ఇది తెరపైకి వచ్చింది. వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలపై చర్చించి, మళ్లీ కలిసిపోయేందుకు త్వరలోనే కలుస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. భాజపా నేతలు కొందరు, వీరిద్దరి భేటీకి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు చెప్పారు దీపాలి. తనను తాను శివసేన లీడర్‌గా చెప్పుకునే దీపాలి ఈ ట్వీట్ చేయటం శివసేనను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పార్టీలో తనకు ఏ క్యాడర్ లేదని స్పష్టం చేసింది శివసేన. 2019లో ముంబ్ర-కల్వా నియోజకవర్గం నుంచి శివసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు దీపాలి. అంతకు ముందు 2014లో ఆప్ తరపున అహ్మదానగర్ నుంచి పోటీ చేసి, అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు.
@OfficeofUT
— Deepali Sayed (@deepalisayed) July 16, 2022
@mieknathshinde
@TawdeVinod
@Pankajamunde pic.twitter.com/20JnC3QSma
అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు..
"శివసైనికుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి ఏక్‌నాథ్ శిందే, ఉద్దవ్ ఠాక్రే మరో రెండు రోజుల్లో కలవనున్నారు. శివసైనికుల అభిప్రాయాలేంటో శిందే పూర్తిగా అర్థం చేసుకున్నారు. అటు ఠాక్రే కూడా శిందే అసహనానికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. అందుకే కొందరు భాజపా నేతలు వీళ్లిద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు" అని ట్వీట్ చేశారు దీపాలి సాయేద్. తన ట్విటర్ డిస్క్రిప్షన్‌లోనూ "శివసేన నేత" అని రాసుకున్నారు దీపాలి. ఈమె ట్వీట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. "నేను సాధారణ కార్యకర్తలాంటి వాడిని. శిందే, ఠాక్రే మధ్య మీటింగ్ జరుగుతుందన్న విషయమైతే నా వరకూ రాలేదు" అని వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండు వారాలు దాటినా, ఇప్పటి వరకూ కేబినెట్ విస్తరణ చేపట్టకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సంజయ్ రౌత్. ఒకవేళ వాళ్లు మంత్రి వర్గ విస్తరణ చేసి, మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించినా..వాళ్లపై అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఉన్నారని అన్నారు. 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఈ అభద్రతా భావంతోనే ఉన్నారని చెప్పారు సంజయ్ రౌత్. సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ కొనసాగుతున్నందున, కేబినెట్ విస్తరణ చేపట్టేలరని స్పష్టం చేశారు.
SSC JE Answer Key: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ పరీక్ష తుది 'కీ' విడుదల
Telangana News: రేవంత్ అన్నంత పని చేస్తున్నారా? అప్పట్లో అదో పెద్ద దుమారం! తొలిరోజు ఆయనే అసలు టార్గెట్!
Gold-Silver Prices Today: తగ్గినట్లే తగ్గి షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
ABP Desam Top 10, 8 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>