అన్వేషించండి

Karnataka Maharashtra Row: వాటిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉద్ధవ్ ఠాక్రే

Karnataka Maharashtra Row: కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.

Karnataka Maharashtra Row: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్దవ్ ఠాక్రే )వర్గం అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray).. అసెంబ్లీలో సోమవారం ఓ డిమాండ్ చేశారు.  కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదం (Karnataka Maharashtra Row) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భాష, సరిహద్దుకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన విషయం అని అన్నారు.

" మరాఠీ మాట్లాడే ప్రజలు తరతరాలుగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి దైనందిన జీవితం, భాష, జీవనవిధానం అంతా మరాఠీలకు సంబంధించినది. ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం.. "కర్ణాటక ఆక్రమించుకున్న మహారాష్ట్ర" భూభాగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి.                                 "
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన

శిందేపై

మరోవైపు ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఠాక్రే తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దూకుడుగా వ్యవహరిస్తుంటే మహారాష్ట్ర సీఎం మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.

" మన ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ శిందే )ఈ అంశంపై ఒక్క మాట అయిన మాట్లాడారా? ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. అక్కడ ప్రశాంత పరిస్థితులు ఉండేవి. అలాంటి ప్రాంతంలో హింస సృష్టిస్తున్నది ఎవరు? ఇప్పటికే కర్ణాటక చట్టసభలు సరిహద్దు సమస్య ముగిసిపోయిందని, ఒక అంగుళం భూమి కూడా పొరుగు రాష్ట్రానికి ఇచ్చేది లేదు అని చెబుతున్నాయి. సంరక్షకుడిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం అలా నడుచుకుందా?                                                 "
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన

బెలగావి మున్సిపల్ కార్పొరేషన్ కర్ణాటక నుంచి మహారాష్ట్రలో విలీనం అవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు.. దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని ఉద్దవ్ అన్నారు. ఇలాగే మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయితీలు తెలంగాణలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేసినప్పుడు.. శిందే ప్రభుత్వానికి ఆ గ్రామ పంచాయితీలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఉందా అని ఠాక్రే ప్రశ్నించారు.

సరిహద్దు సమస్య

భాష ఆధారంగా రాష్ట్రాలను విభజించిన తర్వాత 1957లో ఈ సమస్య ప్రారంభమైంది. ఇంతకముందు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమదేనని, ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని మహారాష్ట్ర అంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో 800లకు పైగా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న గ్రామాలు ఉన్నాయని అంటుంది. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967లో మహాజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన సరిహద్దులను కర్ణాటక కొనసాగిస్తుంది.

Also Read: Lalu Prasad Yadav: కోలుకుంటున్న లాలూకు మరో షాక్- ఆ కేసు రీఓపెన్ చేసిన సీబీఐ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Best Annual Prepaid Plans: ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Embed widget