Tungabhadra Dam: ఎట్టకేలకు తుంగభద్ర గేటు బిగింపు, వరద నీటిని ఆపేసిన అధికారులు
Telugu News: ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేటు ఓపెన్ చేస్తున్న వేళ చైన్ లింక్ తెగిపోయి గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
Tungabhadra Dam Gate News: తుంగభద్ర జలాశయంలోని 19వ ట్రస్ట్ గేట్ కొట్టుకపోవడంతో జలాశయంలోని నీరు అధిక మొత్తంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 19వ క్రస్ట్ గేటు స్థానం లో స్టాప్ లాక్ గేట్ ను అధికారులు విజయవంతంగా బిగించారు. డ్యామ్ గేట్ల నిర్వహణలో నిష్టాతుడైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో తుంగభద్ర జలాశయం 19వ గేటును పూర్తి స్థాయిలో బిగించి అధికారులు సంబరాలు చేసుకున్నారు. దీంతో తుంగభద్ర జలాశయం లోని నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టు అయింది.
జలాశయంలో నీరు ఎందుకు తగ్గింది
తుంగభద్ర జలాశయానికి 33 గేట్లు ద్వారా నీటిని కిందికి విడుదల చేసే వెసులుబాటు ఉంది. ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంలోకి కెపాసిటీ మించి నీరు రావడంతో అప్రమత్తమైన అధికారులు జలాశయం నుంచి 29 గేట్ల ద్వారా నీటిని నదిలోకి విడుదల చేశారు. ఇందులో భాగంగానే 19వ గేటు ఓపెన్ చేస్తున్న తరుణంలో ఆ గేటు చైన్ లింక్ తెగిపోయి గేటు కొట్టుకుపోయింది. దీంతో 105 టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్ర జలాశయంలో గేటు కొట్టుకుపోయిన కారణంగా సుమారుగా 40 టీఎంసీల నీరు వృధాగా పోయింది. డ్యాంలోని నీటి వృధాను ఆపకపోతే ఈసారి ఆయకట్టు రైతుల తో పాటు తాగునీటికి సమస్య ఏర్పడుతుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులు హుటాహుటిన తుంగభద్ర డ్యామ్ కు చేరుకొని పరిశీలించి నీటి వృధాను ఆపేందుకు.. గేటు పునరుద్దించేందుకు అవసరమైన నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని 19వ ట్రస్ట్ తాత్కాలికంగా బిగించి విజయవంతమయ్యారు.
ఐదు విడిభాగాలుగా తాత్కాలిక గేటు
19వ ట్రస్ట్ గేటు ను ఏర్పాటు చేసేందుకు డ్యాం గేట్ల లలో నీ నిష్టార్ధుడైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇంజనీర్లు నిపుణులు గెట్ ను అమర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గేటు సామర్థ్యం 20 అడుగుల ఎత్తు 60 అడుగుల వెడల్పు ఉండడం గేటు బరువు సుమారుగా 60 టన్నులు పైనే ఉంటుందని అంచనా వేసిన అధికారులు ఒకేసారి అంత పెద్ద గేటును తయారుచేసి తీసుకువచ్చి ఇన్స్టాల్ చేయడం కష్టతరం అవుతుందని భావించారు. ఇంజనీర్లు ఆ గేటును ఐదు భాగాలుగా విభజించి నాలుగు అడుగుల ఎత్తు 20 అడుగుల వెడల్పుతో ఐదు భాగాలను తుంగభద్ర జలాశయం కు తీసుకువచ్చి రెండు భారీ క్రేన్లతో వరద ప్రవాహం లోనే గేటు విడిభాగాలను ఒకటి తర్వాత ఒకటి బిగించి విజయవంతం చేశారు. ప్రస్తుతానికి నీరు వృధా గా పోకుండా ఈ తాత్కాలిక గేటును అమర్చినట్లు తుంగభద్ర జలాశయం బోర్డు అధికారులు వివరించారు. ఈ గేటు అమర్చడానికి సుమారుగా 110 సిబ్బంది వారం రోజులుగా శ్రమించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత నీటిమట్టం ఎంత
తుంగభద్ర జలాశయం పూర్తి కెపాసిటీ 105 టీఎంసీలు డేట్ కొట్టుకుపోవడానికి సమయం వరకు 104 టీఎంసీలతో జలాశయం నిండుకుండను తలపించింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద ఇన్ఫ్లో ఎక్కువ అవుతున్నాడంతో అధికారులు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని కిందికి వదులుతున్న తరుణంలో గేటు కొట్టుకుపోయింది. దీంతో వారం రోజులుగా తుంగభద్ర జలాశయంలోని సుమారు 40 టీఎంసీలకు పైగా నీరు నదిలోకి వృధాగా వెళ్ళింది. ప్రస్తుతం జలాశయంలో 1623 అడుగుల మేర 72 టీఎంసీలు నీరు ఉంది. 40 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో తో డ్యామ్ లోకి నీరు చేరుతుంది. పదివేల క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతోంది.
ఇంజనీర్లను, అధికారులను అభినందించిన ప్రభుత్వాలు
19వ క్రస్ట్ గేటు స్టాప్లక్ ఇన్స్టాల్మెంట్ను విజయవంతంగా పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులకు బోర్డు అధికారులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు అభినందనలు తెలిపారు. స్టాప్ లాక్ తాత్కలిక గేటును వరద కొనసాగుతున్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేయడంతో ఆయకట్టు రైతులకు ఈసారి పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు. గత పది రోజులుగా కష్టపడిన అధికారులు కార్మికులు గెట్ ను బిగించడం విజయవంతం కావడంతో సంబరాలు చేసుకొని మిఠాయిలు తినిపించుకున్నారు.