అన్వేషించండి

Tirumala Rental Prices: శ్రీవారి భక్తులకు షాక్ - భారీగా పెరిగిన వసతిగృహాల గదుల అద్దె!

Tirumala Rental Prices: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ షాకిచ్చింది. వసతి గృహాల గదుల అద్దెను భారీగా పెంచేసింది. 500, 600 నుంచి వెయ్యి రూపాయలకు పెంచేశారు. 

Tirumala Rental Prices: తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ గట్టి షాకిచ్చింది. ఆధునికీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దెను భారీగా పెంచేసింది. ఈ నిర్ణయంపై సామాన్య, మధ్య తరగతి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వ్యాప్తంగా అన్ని పాత వసతి కేంద్రాలను ఆధునికీకరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు 110 కోట్ల రూపాయలతో టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టారు. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు కల్పించి అద్దెను పెంచేశారు. తిరుమలలో దాదాపు ఆరు వేల గదులు ఉన్నాయి. ఇప్పటికే తిరుమలలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా 500, 600 రూపాయల నుంచి 1000 రూపాలయలు పెంచేశారు. 

750 రూపాయల నుంచి 1700 రూపాయలకు పెంపు..

ఈనెల ఒకటో తేదీ నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్ లోని 1, 2, 3లో గదులను 150 రూపాయల నుంచి జీఎస్టీతో కలిపి 1700 రూపాయలను చేశారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ నాలుగులో ఒక్కో గదిని 750 రూపాయల నుంచి 1700 రూపాయలకు పెంచారు. కార్నర్ సూట్ ను జీఎస్టీతో కలిపి రూ.2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్ ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్ నగదుతో కలిపి 3400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలపై సామాన్య భక్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తుల కోణంలో చూడాలని కోరుతున్నారు. అద్దెను వీలయినంత వరకు తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

ఇప్పటికే చాలా వరకు అతిథి గృహాల ధరలను పెంచిన టీటీడీ.. సాధారణ భక్తులు ఎక్కువగా వసతి పొందే రూ.50 అద్దెతో లభించే ఎన్ఎంసీ, ఎస్ఎన్సీ, ఏఎన్సీ, హెచ్వీసీ, రూ.100 అద్దెతో అందించే రాంభగీచా, వరాహ స్వామి గెస్ట్ హౌస్, ఎస్ఎన్జీహెచ్, హెచ్వీడీసీ, ఏటీసీ, టీబీసీ, సపత్గిరి అతిథి గృహాల్లో కూడా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి గదుల అద్దె పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈనెల 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడీ) టికెట్లను ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈనెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దర్శన టికెట్లను ఆన్ లైన్ లో జారీ చేసిన విషయం తెలిసిందే. 

శుక్రవారం ఒక్కరోజే 4.53 కోట్ల రూపాయల హుండీ ఆదాయం

తిరుమలలో‌ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. శనివారం శుక్రవారం ఒక్క రోజో 45,887 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 17,702 మంది తలనీలాలు సమర్పించగా.. 4.53 కోట్ల రూపాయలను భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Swiggy One BLCK: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Embed widget