News
News
X

TTD News: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం - బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పాలకమండలి

 TTD News: ఈరోజు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహిస్తోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ ప్రవేశ్ పెట్టబోతున్నారు. 

FOLLOW US: 
Share:

TTD News: ఈరోజు టీటీడీ పాలకమండలి సమావేశం జరగబోతోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తిరుపతి సమీపంలోని దేవలోక్ లో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం కోసం 112 కోట్లు నిధులు కేటాయిస్తారు. ఉల్లందూర్ శ్రీవారి ఆలయ నిర్మాణానికి నాలుగు కోట్లు రూపాయల నిధులు కేటాయించబోతున్నట్లు సమాచారం. అలాగే యానంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు, తిరుమలలో లడ్డూ వితరణ కేంద్రం విస్తరణ, అదనంగా మరో ఐదు కౌంటర్లు నిర్మాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇంజనీరింగ్ పనులతో పాటుగా 398 అంశాలతో పాలక‌ మండలిలో చర్చించనున్నారు. 3,300 కోట్ల రూపాయలతో 2023-24 బడ్జెట్ ను టీటీడీ ప్రవేశ పెట్టబోతోంది. ఆనంద నిలయం స్వర్ణమయంపై కూడా ఈ రోజు సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. 

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?

శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.. ఇక మంగళవారం రోజున 70,789 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 21,215 మంది తలనీలాలు సమర్పించగా, 4.13 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 24 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు ఐదు గంటల సమయం పడుతుంది.

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. ఇందులో‌ భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు.. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి.. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు,‌ సూచనల మేరకు టిటిడి రద్దు చేసింది.. కేవలం ఏడాదికి‌ ఓ మారు సర్కారు వారి సహస్రకళషాభిషేకం టిటిడి నిర్వహిస్తొంది.. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.. 

Published at : 15 Feb 2023 08:48 AM (IST) Tags: TTD News Tirumala latest updates TTD Meeting Tirumala News TTD Governing Body Meeting

సంబంధిత కథనాలు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీల్లో కోత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీల్లో కోత!

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Ahmedabad News: ఆప్ బీజేపీ మధ్య ఆగని పోస్టర్ల పంచాయితీ, 8 మంది అరెస్ట్

Ahmedabad News: ఆప్ బీజేపీ మధ్య ఆగని పోస్టర్ల పంచాయితీ, 8 మంది అరెస్ట్

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

టాప్ స్టోరీస్

నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి

నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు