News
News
వీడియోలు ఆటలు
X

TTD News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - గురువారం హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 30 గంటల సమయం పడుతోంది.

FOLLOW US: 
Share:

TTD News: వేసవి సెలవులు, వారంతరం కావడంతో తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం రోజున 66,820 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 36,905 మంది తలనీలాలు సమర్పించగా, 3.29 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లల్లో భక్తులు నిండిపోగా.. బయట శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్సలలో వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు ముప్పై గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

తిరుమల సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు. 

Published at : 19 May 2023 10:08 AM (IST) Tags: TTD Updates Tirumala latest updates Tirumala Rush TTD hundi income Tirumala News

సంబంధిత కథనాలు

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

Rahul Gandhi: 2 ఎఫ్ఐఆర్ లలో 15 లైంగిక వేధింపుల ఆరోపణలు, మోదీ రక్షణ కవచంలో బీజేపీ ఎంపీ- రాహుల్ ఫైర్

Rahul Gandhi: 2 ఎఫ్ఐఆర్ లలో 15 లైంగిక వేధింపుల ఆరోపణలు, మోదీ రక్షణ కవచంలో బీజేపీ ఎంపీ- రాహుల్ ఫైర్

No Fault Divorce: విడాకులు తీసుకోవాలంటే కారణాలు అవసరం లేదు, ఈ నో ఫాల్ట్ డైవర్స్ గురించి మీకు తెలుసా?

No Fault Divorce: విడాకులు తీసుకోవాలంటే కారణాలు అవసరం లేదు, ఈ నో ఫాల్ట్ డైవర్స్ గురించి మీకు తెలుసా?

CGI: సీజీఐలో అసోసియేట్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

CGI: సీజీఐలో అసోసియేట్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

టాప్ స్టోరీస్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!