అన్వేషించండి

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 18 గంటల సమయం

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 15 కంపార్మెంట్లలో భక్తులు వేడచి ఉండగా.. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.  

TTD News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఏడు కొండలకు క్యూ కడుతున్నారు. సోమవారం రోజున 78,349 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 39,634 మంది తలనీలాలు సమర్పించగా, 4.56 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 18 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో‌ టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.

అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి ప్రసాదాలు..

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన"

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget